విడదల రజిని....ఏపీ రాజకీయాల్లో మంచి క్రేజ్ ఉన్న లేడీ ఎమ్మెల్యే. రాజకీయాల్లోకి కొత్తగా వచ్చి...వెంటనే ఎమ్మెల్యేగా గెలిచి, తక్కువ సమయంలో అదిరిపోయే ఫాలోయింగ్ సొంతం చేసుకున్న నాయకురాలు. ఎన్‌ఆర్‌ఐగా వచ్చిన రజిని 2019 ఎన్నికల ముందు టి‌డి‌పిలో చేరి, టి‌డి‌పి సీనియర్ నాయకుడు ప్రత్తిపాటి పుల్లారావుకు సపోర్ట్‌గా నిలిచారు. అయితే ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో ఆమె వైసీపీలో చేరి, అదే ప్రత్తిపాటిపై పోటీకి దిగారు. అయితే తొలిసారి ఎన్నికల బరిలో దిగిన రజిని, రాజకీయ దిగ్గజమైన ప్రత్తిపాటిని చిలకలూరిపేట బరిలో ఓడించడం కష్టమే అని అంతా అనుకున్నారు.

కానీ ఊహించని విధంగా రజిని, ప్రత్తిపాటిని చిత్తు చేసి, తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. సరే ఎన్నికల్లో ఏదో జగన్ గాలిలో గెలిచారు...ఆ తర్వాత ఎమ్మెల్యేగా నిలదొక్కుకోవడం కష్టమని అనుకున్నారు. ఆ తర్వాత కూడా రజిని తనదైన శైలిలో పనిచేస్తూ, ఏపీ రాజకీయాల్లో క్రేజ్ తెచ్చుకున్నారు. ఒక్క చిలకలూరిపేటకే పరిమితమైన రజిని, ఈ రెండేళ్లలోనే రాష్ట్ర వ్యాప్తంగా జనాలకు తెలిశారు.

ఒక్క వైసీపీలోనే కాదు, టి‌డి‌పి వాళ్ళకు కూడా రజిని అంటే ఎవరో తెలుసు. ఆ స్థాయిలో రజిని ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. ఇలా తక్కువ సమయంలోనే క్రేజ్ తెచ్చుకున్న రజిని, ఆ క్రేజ్‌ని కంటిన్యూ చేస్తూ రాజకీయాల్లో సత్తా చాటగలరా? లేదా? అనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తున్న ప్రశ్న. ప్రస్తుతానికైతే రజినికి చిలకలూరిపేటలో తిరుగులేదు.

కానీ ఆమె సొంత పార్టీ నాయకులతోనే విభేదాలు పెట్టుకోవడం, అపోజిట్‌లో సీనియర్ నాయకుడు ప్రత్తిపాటి రాజకీయం...ఇలాంటి అంశాలు రజినికి మైనస్ అయ్యేలా కనిపిస్తున్నాయి. ఎందుకంటే సొంత పార్టీలో బలంగా ఉన్న కమ్మ నాయకులతో రజినికి పడటం లేదు. ఈ అంశం అదే కమ్మ వర్గానికి చెందిన ప్రత్యర్ధి ప్రత్తిపాటికి కలిసొచ్చేలా ఉంది. దీనిపై రజిని కాస్త ఫోకస్ పెట్టి, సొంత పార్టీ నాయకులకు దగ్గరైతే వచ్చే ఎన్నికల్లో ఇబ్బందులు ఉండవు. లేదంటే ఉన్న క్రేజ్ పోయే ఛాన్స్ కూడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: