తెలంగాణాలో రానున్న ఎన్నికల్లో పోటీ మాములుగా ఉండేలా లేదు. సాధారణంగా ఏ రాష్ట్రంలో అయినా సార్వత్రిక ఎన్నికలు జరిగితే ఎన్ని పార్టీలు ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీలో నిలిచినా గెలుపు మాత్రం రెండు ప్రధాన పార్టీల మధ్యనే దోబూచులాడుతూ ఉంటుంది. కానీ తెలంగాణలో ఈ సారి ఖచ్చితంగా పోటీ నాలుగు పార్టీల మధ్యన ఉండనుందన్న విషయం స్పష్టమవుతోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న తెరాస తో పాటుగా, రేవంత్ రెడ్డి నాయకత్వంలో మళ్ళీ పుంజుకుంటున్న కాంగ్రెస్, రెండు సంవత్సరాల నుండి విశేష ప్రజాదరణ పొందిన భారతీయ జనతా పార్టీ మరియు రాజన్న వారసురాలిగా తెలంగాణ గడ్డపై పార్టీ పెట్టిన షర్మిల పార్టీల మధ్యన పోటీ ఉండనుంది అనే విషయం స్పష్టంగా తెలుస్తోంది.

రాబోయే ఎన్నికలే గెలుపే లక్ష్యంగా వీరందరూ తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇందులో బీజేపీ అధ్యక్షుడైన బండి సంజయ్ గత వారం రోజుల నుండి నిర్విరామంగా పాద యాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్రలో ప్రజల నుండి విశేష స్పందన వస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. బండి సంజయ్ మధ్య మధ్యలో బహిరంగ సభలను ఏర్పాటు చేస్తూ అధికార పార్టీపై తన విమర్శలతో నిప్పులు చెరుగుతున్నారు. ఈ రోజు వికారాబాద్ లో బండి సంజయ్ పాదయాత్ర జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ప్రజలను ప్రభుత్వం అందిస్తున్న పధకాలు వారికి చేరుతున్నాయా లేదా అని అడిగి తెలుసుసుకుంటున్నారు. ముఖ్యంగా ఎన్నికల హామీలలో భాగంగా ఇచ్చిన డబల్ బెడ్ రూమ్ విషయం గురించి కూడా ఆరా తీస్తున్నారు.

ఇందులో కొందరు ప్రజలు కేసీఆర్ చెప్పిన విధంగా డబల్ బెడ్ రూమ్ ఇల్లు మాకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా బండి సంజయ్ తన ప్రజా సంగ్రామ యాత్రలో ముందుకు దూసుకుపోతున్నారు.  ఇప్పటికే బీజేపీకి ఉన్న పేరుతో పాటు ఈ పాదయాత్ర పార్టీ ఉన్నతికి బాగా ప్రయోజనంగా ఉండనుందని పలువురు అనుకుంటున్నారు. మరి ఈ యాత్రను ఎంతవరకు అర్ధం చేసుకుంటారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఆదరిస్తారా వంటి పలు ప్రశ్నలకు సమాధానాలు దొరకాలంటే మరి కొంత కాలం ఆగాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: