వినాయ‌క పందిళ్ల‌కు అనుమ‌తుల్లేవ‌ని విజయవాడ సీపీ, బీ శ్రీనివాసులు స్ప‌ష్టం చేశారు. వినాయక ఉత్సవాలకు ఈ సారి కూడా విగ్రహాలు పెట్టేందుకు ఎటువంటి అనుమతులు లేవ‌ని సీపీ క్లారిటీ ఇచ్చారు. కాబ‌ట్టి ఇళ్ళలో చిన్న విగ్రహాలతో వినాయక చవితి చేసుకోవాల‌ని సీపీ ప్ర‌జ‌ల‌కు సూచించారు. క‌రోనా కార‌ణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని సీపీ గుర్తు చేశారు. కాబ‌ట్టి ప్ర‌జ‌లు పోలీసుల‌కు స‌హ‌క‌రించాల‌ని ఆయ‌న కోరారు. అంతే కాకుండా ఇటీవ‌ల విజ‌య వాడ‌లో వృద్ధురాలి హ‌త్య కేసు గురించి కూడా సీపీ సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించారు. కుందా వారి కండికలో బంగారం కోసమే  వృద్ధురాలు సుబ్బమ్మను దుండ‌గులు హత్య చేశారని సీపీ వ్యాఖ్యానించారు. 

గత నెల 26 న కుందా వారి కండ్రికలో సుబ్బమ్మను ఐరన్ రాడ్ తో దుండ‌గులు కొట్టి చంపారని శ్రీనివాసులు వ్యాఖ్యానించారు. శాస్త్రీయ పరిజ్ఞానంతో విచారణ జరిపి నిందితులను అరెస్ట్ చేశామ‌ని సీపీ స్ప‌ష్టం చేశారు. ఈ హత్య కేసులో మొత్తం ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశిన‌ట్టు శ్రీనివాసులు వెల్లడించారు. నింధితులు పల్లె రాము , ముదోలి నాగరాజు కలిసి సుబ్బ‌మ్మ‌ను హాత్య చేశారని సీపీ అన్నారు. పల్లె రాము  ఫిబ్రవరి నుండి ఇప్పటి వరకు మూడు నేరాలు చేసాడని సీపీ చెప్పారు.

ఒంటరిగా ఉండే వృద్ధ మహిళలపై దాడి చేసి ఈ నేరాలకు ప‌ల్లె రాము నేరాల‌కు పాల్పడ్డాడ‌ని వివ‌రించారు. నగరంలో పలు ప్రాంతంలో చాలా మంది ఒంటరిగా  వృద్ధులు, మహిళలు నివసిస్తున్న విషయం గుర్తించామ‌ని సీపీ తెలిపారు. వారి పై పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని సీపీ స్ప‌ష్టం చేశారు. దిశ యాప్ ను ఒంటరి గా ఉండే మహిళలకు నేర్పిస్తున్నామ‌ని సీపీ తెలిపారు. అంతే కాకుండా విజ‌య వాడ‌లో సంచ‌ల‌నం రేపిన వ్యాపారి రాహుల్ హ‌త్య కేసుల‌పై కూడా సీపీ స్పందించారు. రాహుల్ మర్డర్ కేసులో ఇప్పటి వరకు మొత్తం 12  మందిని అరెస్ట్ చేశామ‌ని సీపీ తెలిపారు. ఇంకా ఒకరి కోసం గాలిస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. నింధితురాలు గాయత్రి ని  కూడా అరెస్ట్ చేసి విచారించామ‌ని సీపీ స్ప‌ష్టం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: