ఉద్యమాల్లో కేసీఆర్ ను ఎందరో నడిపించారు. కేసీఆర్ నడిపిన ఉద్యమాలు కన్నా కేసీఆర్ ను నడిపించిన ఉద్యమాలే రాజకీయం గా ఆయనను పెద్దవాణ్ని చేశాయి అనడం అతిశయం కాదు. తెలంగాణ ఏర్పాటు అయ్యాక, రాష్ట్ర రాజకీయాల్లో తనదైన పాత్ర పో షించాలన్న తపనలో భాగంగా ఆయన మంత్రి పదవిని ఆశించారని, అది కేసీఆర్ కాదన్న కారణంగానే టీఆర్ఎస్ కు దూరంగా ఉం టున్నారని అంటుంటారు చాలా మంది రాజకీయ నాయకులు. అది నిజమో అబద్ధమో కానీ తెలంగాణ కొట్లాట తరువాత ప్రొఫైసర్ చాలా సామాజిక ఉద్యమాలు లీడ్ తీసుకున్నారు. ఆశించిన స్థాయిన గొంతు వినిపించని కారణంగా ఫెయిల్ అయ్యారు అన్నది మాత్రం వాస్తవం.



తెలంగాణ కొట్లాటలో భాగం అయిన వారెవ్వరూ లేరు. తెలంగాణ కొట్లాటకు కారణం అయిన వారు ప్రగతి భవన్ వెలుగులోనో, చీక టి లోనో ఎందులోనూ లేరు. తెలంగాణ ఉద్యమాలకు సారథ్య వహించిన ప్రొఫెసర్లు అస్సలు లేరు. కేసీఆర్ చుట్టూ టీడీపీ కోవర్టులు మి నహా ఎవ్వరూ లేరు....అన్నది కొందరి ఆవేదన. ఈ ఆవేదనకు రూపం ఇస్తే తలసాని లాంటి లీడర్లు, తుమ్మల లాంటి లీడర్లు వె లుగు చూస్తారు. ఈ ఆవేదనకు రూపం ఇస్తే కాంగ్రెస్ నుంచి వచ్చిన నాగేందర్ లాంటి లీడర్లు గుర్తుకువస్తారు. కేసీఆర్ కు కావాల్సి న వారే వారు. ఉద్యమాలకు ఊపిరి పోసిన వారు ఇప్పుడు ఎక్కడ అని అడగకండి కోపం వస్తుంది. ఇవాళ ప్రొఫైసర్ కోదండరాం బ ర్త్ డే .ఆయనకు విషెస్ చెప్పండి చాలు ఇంకేం వద్దు.



ముద్దసాని కోదండరాం రెడ్డి.. ఆయన త్వరలో వైఎస్సార్టీపీతో పనిచేస్తారా లేదా అన్నది తెలియదు కానీ తెలంగాణ కొట్లాటలో కీల కం అని మాత్రం చెప్పవచ్చు. విద్యార్థి రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయి నుంచి ఓయూ రాజకీయాలను మలుపు తిప్పగలిగే స్థా యి వరకూ ప్రొఫెసర్ కు తిరుగే లేదు. తెలంగాణ వచ్చాక కూడా కోదండ రామ్ అనేక పాట్లు పడ్డారు. సొంతంగా పార్టీ పెట్టి అవ మా నాలు పొందారు. తెలంగాణ జన సమితి పేరిట ప్రారంభించి బలమయిన నాయకత్వం ఉన్న టీఆర్ఎస్ ను ఓడించలేకపోయా నని బాధ కూడా వ్యక్తం చేస్తుంటారు. జయశంకర్ సర్ తరువాత తెలంగాణను ప్రభావితం చేసిన విద్యావంతుడు కోదండరామ్ అనే చె ప్పాలి. ఆయన లానే కేసీఆర్ ను ఉద్యమ వేళల్లో గైడ్ చేశారు కూడా! కానీ తరువాత కాలంలో వచ్చిన అభిప్రాయ భేదాల కార ణంగా ఆయన బయటకు వచ్చేశారు. ఇప్పుడాయన ఒంటరి. యాక్టివ్ కావాలనుకుంటున్నారు కానీ అంతగా ఆయన ప్రభావం ఉండడం లేదు..అన్నది కూడా వాస్తవమే!




మరింత సమాచారం తెలుసుకోండి: