సీనియర్ అయిన తుమ్మలకు పార్టీలో చోటు లేదు అని తేల్చేశారు కొందరు. గులాబీ కండువ ఒంటిపై ఉన్న రక్తంలో ప్రవహించేది తెలుగు దేశ భక్తి అని కూడా తేల్చారు కొందరు. ఇదే మాట రేవంత్ కు కూడా అన్నారు. కనుక పాత నేస్తులంతా కలిసి కాంగ్రెస్ కు ప్రాణం పోస్తారని భావించారు ఇంకొందరు. పాత దోస్తులంతా కలిసి చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రకారం తెలంగాణలో పనిచేసి, తమ సత్తా చాటి ప్రభు భక్తి ఏంటన్నది నిరూపిస్తారని ఓ సమాచారం కూడా వెలుగులోకి తెచ్చారు కొందరు రాజకీయ నాయకులు. రేవంత్ వ్యతిరేకులు. ఇప్పటికే కోమటిరెడ్డి ఎపిసోడ్ ఎలా అయితే కాంగ్రెస్ లో గతి తప్పుతోందో అలానే తుమ్మల ఎపిసోడ్ కూడా అయ్యే అవకాశం ఉన్నందున అప్రమత్తం అయిన తుమ్మల ఎందుకు వచ్చిన తలనొప్పి అని ఓ క్లారిటీ అయితే ముందుగానే ఇ చ్చారు. ఇందుకు తగ్గ కారణాలేవీ ఇప్పటిదాకా తెలియవు. తుమ్మల మాత్రం కేటీఆర్ పేరు తన ప్రకటనలో చెప్పి, యువరాజు సా యంతో ఖమ్మం జిల్లా అభివృద్ధికి నేను సైతం అంటానని తెలిపారు. దీనిపై ఇప్పటిదాకా ఉన్న స్తబ్దత పోతుందని, సోషల్ మీడియా సమాచారాలను మీరిక నమ్మవద్దని హితవు చెప్పారు సీనియరు అయిన తుమ్మల. మరి! నిప్పు లేకుండా పొగ ఎట్టా?



ఇదీ పూర్వ నేపథ్యం :
ఇద్దరు లీడర్లు ఖమ్మం జిల్లా పాలిటిక్స్ ను శాసిస్తున్నారు. వారిలో ఒకరు కమ్యూనిస్టు భావ జాలం ఉన్న కుటుంబం నుంచి వ చ్చిన లీడరు. మరొకరు జగన్ తో కొంత కాలం పనిచేసి వచ్చిన లీడరు. కమ్మ సామాజికవర్గానికి చెందిన పువ్వాడ అజయ్ అదే సామాజి క వర్గానికి చెందిన తుమ్మలను అడ్డుకుంటున్నారని వినికిడి. రెడ్డి సామాజికవర్గానికి చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూడా తుమ్మలకు అడ్డం పడుతున్నారట! ట ట ట! తెలియదు కానీ జరిగేది పైకి తేలదు. జరగబోయేది ఆగదు అన్న మెట్ట వేదాం తం ఒకటి తుమ్మల విషయమై అనుకోండి. ఏం కాదు. వాస్తవానికి టీఆర్ఎస్ లో సెప్టెంబరు ముసలం ఉంటుం దని అంతా అనుకు న్నారు. కానీ లేకుండా పోయింది. టీఆర్ఎస్ ను కాదని రేవంత్ దగ్గర కు ఆయన వెళ్తాడని అంతా అనుకు న్నారు అవన్నీ అబద్ధాలే అని తేలిపోయింది. ఫలితం అంతా అనుకున్న విధంగా ఏమీ జరగక పోవడం కేటీఆర్ కు రిలీఫ్. కేసీఆర్ కు రిలీఫ్ అవునో కాదో తెలి యదు. ఏదేమైనప్పటికీ పార్టీని వీడుతారా లేదా అన్నది ఇప్పటిదా కా ఉన్న సందిగ్ధం. తాను పార్టీని వీడేదే లేదని తేల్చి చెప్పారు తుమ్మల. తాను ఖమ్మం జిల్లాకు చేయాల్సింది చాలా ఉందని, పార్టీని వీ డేందుకు తనకు ఆలోచనే లేదని, తను చేయని ఆలోచన లను తనవిగా ప్రచారం చేయవద్దని విన్నవించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: