ఏపిలో వెలుగు చూసిన‌ న‌కిలీ చ‌లానాల వ్య‌వ‌హారం రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించింది..ఇప్ప‌టి వ‌ర‌కు 38 స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో న‌కిలీ చ‌లానాల వ్య‌వ‌హారం వెలుగు చూసింది..8.13 కోట్ల రూపాయిల మేర న‌కిలీ చ‌లానాల‌ను గుర్తించ‌గా..అందులో ఇప్ప‌టి వ‌ర‌కు 4.63 కోట్ల రుపాయిలు రిక‌వ‌రీ చేశారు..ఈ వ్య‌వ‌హారంలో ఇప్ప‌టికే 14 మంది స‌బ్ రిజిస్ట్రార్ ల‌పై ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోగా..న‌కిలీ చ‌లానాల‌కు కార‌ణ‌మైన‌ 33 మంది ప్ర‌యివేట్ వ్య‌క్తుల‌పై క్రిమిన‌ల్ కేసులు న‌మోద‌య్యాయి.

గ‌త నెల ఆగ‌ష్టు రెండున క‌డ‌ప స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యంలో వెలుగు చూసిన న‌కిలీ చ‌లానాల కుంభ‌కోణం.. రాష్ట్రంలో  సంచ‌ల‌నం సృష్టించింది..నెల రోజుల వ్య‌వ‌ధిలో ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్ర వ్యాప్తంగా 38 స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో న‌కిలీ చ‌లానాలు ను గుర్తించింది ప్ర‌భుత్వం..ఇప్ప‌టి వ‌రకు సుమారు 8.13 కోట్ల రుపాయిలు మేర న‌కిలీ చ‌లానాలు బ‌య‌ట ప‌డ్డాయి..స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష‌న్ల శాఖ దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా స‌బ్ రిజిస్ట్రార్ల కార్యాల‌యాల్లో గ‌త ఎడాదిన్న‌ర గా జరిగిన రిజిస్ట్రేష‌న్ల‌ను ర్యాండ‌మ్ గా త‌నిఖీ చేశారు..ఇదే స‌మ‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వ ఖ‌జనాకు న‌ష్టం వాటిల్లిన డ‌బ్బుల్లో దాదాపు 4.63 కోట్ల రుపాయిలు మేర సబ్ రిజిస్ట్రార్లు, డాక్యుమెంట్ రైట‌ర్లు నుండి రిక‌వ‌రీ చేశారు.. న‌కిలీ చ‌లాన‌లా వ్య‌వ‌హారంలో సంబందం ఉంద‌ని భావించి 14 మంది స‌బ్ రిజిస్ట్రార్ల‌లో కొంద‌రిని స‌స్పెండ్ చేయ‌గా...మ‌రికోంద‌రి పై బ‌దిలీ వేటు వేసింది ప్ర‌బుత్వం.. అయితే న‌కిలీ చలాన్ల ను సృష్టించిన వారిలో డాక్యుమెంట్ రైట‌ర్ల‌దే కీల‌క పాత్ర‌గా తెల్చిన ప్ర‌బుత్వం.. అందుకు కార‌ణమైన 33 మంది ప్ర‌యివేట్ వ్య‌క్తులు పై క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేసింది ప్ర‌భుత్వం.

ఇప్ప‌టి వ‌ర‌కు రిజిస్ట్రేష‌న్ల శాఖ జ‌రిపిన విచార‌ణ‌లో క‌డ‌ప జిల్లాల్లో 1.29 కోట్లు,కృష్ణా జిల్లాలో 4.20 కోట్లు, విశాఖ జిల్లాలో1.39 కోట్లు..పెద్ద మొత్తంలో న‌కిలీ చ‌లానాలు బ‌య‌ట‌ప‌డ‌గా.. రిజిస్ట్రేష‌న్ల శాఖ ప్ర‌భుత్వ ఖ‌జ‌నాకు న‌ష్టం రాకుండా రిక‌వ‌రీల‌పైనే ప్ర‌ధానంగా దృష్టి సారించింది..దీనిలో భాగంగా కృష్టా జిల్లాలో అత్య‌ధికంగా 4.20 కోట్ల రుపాయిలు మేర న‌కిలీ చ‌లానాల‌ను గుర్తించ‌గా..దానిలో 2.60 కోట్ల మేర రిక‌వ‌రీ చేశారు.. ఇక విశాఖ ప‌ట్నంలో 1.39 కోట్ల కు గాను..23.58 ల‌క్ష‌లు మాత్ర‌మే రిక‌వ‌రీ చేశారు...క‌డ‌ప జిల్లాలో 1.29 కోట్ల రుపాయిలకుగాను..57.34 ల‌క్ష‌ల రుపాయిలు మేర రిక‌వ‌రీ చేశారు..ఇక త‌క్కువ మొత్త‌లైన‌ప్ప‌టికి విజ‌య‌న‌గ‌రం,కాకినాడ‌, గుంటూరు, ఒంగోలు, చిత్తూరు, క‌ర్నులు జిల్లాల్లో 100 శాతం మేర రిక‌వ‌రీ చేశారు...ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వ ఖ‌జ‌నాకు జ‌రిగిన న‌ష్టంలో 57 శాతం మేర రీక‌వ‌రి అయ్యింది..మిగిలిన మొత్తం రిక‌వ‌రీ పై రిజిస్ట్రేష‌న్ల శాఖ ఫోక‌స్ పెట్టింది..

న‌కిలీ చ‌లానాల వ్య‌వ‌హారం తో అప్ర‌మ‌త్త‌మైన రిజిస్ట్రేష‌న్ల శాఖ‌.. రిజిస్ట్రేష‌న్ల శాఖ‌తో సిఎఫ్ఎంఎస్ తో అనుసంధానం చేశారు..దీని ద్వారా ఇక పై ప్ర‌తి రిజిస్ట్రేష‌న్ కి ఎంత చ‌లానా క‌ట్టారు.. ఎంత మొత్తం చ‌లానా క‌ట్టారో నేరుగా రిజిస్ట్రేష‌న్ల శాఖ వెబ్ సైట్ లో ప్ర‌త్య‌క్షంగా క‌నిపిస్తోంది..దీంతో ఇక పై ఎలాంటి అక్ర‌మాల‌కు అస్కారం ఉండ‌ద‌ని రిజిస్ట్రేష‌న్ల శాఖ బావిస్తుంది..రాష్ట్ర ప్ర‌భుత్వ రాబుడ‌ల‌కు కీల‌మైన స్టాంప్స్ అండ్ రిజిస్ఱ్రేష‌న్ల శాఖ పై ప్ర‌తి క్ష‌ణం ఫోక‌స్ పెట్టాల‌ని ఉన్న‌తాధికారులను రాష్ట్ర ప్ర‌భుత్వం అదేశించింది,

మరింత సమాచారం తెలుసుకోండి: