చైనా దురాక్రమణకు ఏదైనా ఒకటే. అది గాలి, నీరు, భూమి, ఆకాశం అనే తేడా ఏ మాత్రం లేదు. భూమిపై ఆధిపత్యం కొనసాగించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్న డ్రాగన్ ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసింది. అంతరిక్షంలో కూడా దురాక్రమణ చేసేందుకు చైనా ప్లాన్ చేసింది. ఇప్పటి వరకు ఎలాంటి హద్దులు లేని స్పేస్‌లో ఓ స్పేస్ స్టేషన్ నిర్మాణానికి రెడీ అయ్యింది చైనా. అది కూడా ఏకంగా కిలో మీటర్ పొడవున్న స్పేస్ స్టేషన్.

ప్రస్తుతం అంతరిక్షంలో అన్నీ దేశాల కోసం అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ అందుబాటులో ఉంది. కానీ దీని కంటే మరింత పెద్దది నిర్మించాలని చైనా డిసైడ్ అయ్యింది. ఇందు కోసం ఏకంగా 173 కోట్ల 57 లక్షల రూపాయలకు పైగా ఖర్చు చేయాలని డ్రాగన్ కంట్రీ డిసైడ్ అయ్యింది. చైనా నేషనల్ నేచురల్ సైన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో న్యూ స్పేస్ స్టేషన్ నిర్మించనుంచి డ్రాగన్ కంట్రీ. భవిష్యత్తుల్లో అంతరిక్షం నుంచి వనరుల వినియోగం, స్పేస్ అన్వేషణపై ప్రయోగాలను మరింత సులభం చేసేందుక చైనా ప్రయత్నిస్తోంది. భూమిపై నుంచే ఈ స్పేస్ స్టేషన్‌ను నియంత్రించేందులా కూడా దీనిని నిర్మిస్తోంది చైనా.

భూమిపైన కొన్ని భాగాలు సిద్ధం చేసుకుని... వాటిని స్పేస్‌లో నిర్మించే స్టేషన్‌లో కలిపేలా చైనా ప్లాన్ చేసింది. ఇప్పటికే ఓ మినీ స్టేషన్‌ను చైనా నిర్మిస్తోంది. దీని కోసం టియాంగిన్ స్టేషన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్ర నిర్మాణంలో చైనా వ్యోమగాములు బిజీగా ఉన్నారు. దీనికి తోడు మరో మెగా స్పేస్ స్టేషన్‌ను కిలోమీటర్ పొడవున నిర్మిస్తోంది చైనా. చైనాకు చెందిన లాంగ్ మార్చ్ 5 బీ రాకెట్ ఇటీవల నియంత్రణ కోల్పోయి భూమి వైపు దూసుకొచ్చింది. అయితే అది ఇండోనేషియా సముద్రంలో పడిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇప్పుడు డ్రాగన్ నిర్మించనున్న మెగా స్పేస్ స్టేషన్ మానవాళిని మరింత కలవరపెడుతోంది. సరిహద్దుల వద్ద కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న డ్రాగన్ కంట్రీ... ఇక స్పేస్‌లో కూడా అదే దురాక్రమణకు తెర లేపినట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: