చంద్రబాబు  వైఖరి తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగిస్తోందా...? క్యాడర్ బాగానే ఉన్నా...పార్టీని సరిగ్గా నడిపించే లీడరే టిడిపి కి కరవయ్యారా..? సీనియారిటీ వల్ల రావల్సిన మెచ్యూరిటీ రాకపోగా  పార్టీలో డిఫరెంట్ వాయిస్ వినిపిస్తోంద ? ఆయనే మళ్లీ రావాలి అంటే ముందు ఆయన మారాలన్న నినాదం టీడీపీలో కనిపిస్తోంద ?

ప్రతిపక్ష టీడీపీకి ఏపీ ప్రజలు భారీ షాక్ ఇచ్చిన వేళ కొద్దీ రోజులుగా టీడీపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.40ఇయర్స్ ఇండస్ట్రీ,మూడు సార్లు  ముఖ్యమంత్రి అయిన తమ అధినేత ఎన్నికల జరిగిన తీరు క్షేత్ర స్థాయిలో  వాస్తవ పరిస్థితులను అంచనా వేయలేకపోవడంతో తెలుగు తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు.2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు పట్టం గట్టినా టీడీపీపై ప్రజల్లో ఎన్నో ఆశలు ఉన్నాయని అయినప్పటికీ ప్రజల అవసరాల్ని మనోగతాన్ని గుర్తించడంలో తమ అధినేత ఎందుకు దృష్టి సారించలేదో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు తెలుగు తమ్ముళ్లు.రాష్ట్రంలో ప్రధానమైన మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు అవకాశం కల్పిస్తారని ఆశలు పెట్టుకున్న టీడీపీకి కనీసం డిపాజిట్లు రాకుండా ఓటర్లు ఇచ్చిన తీర్పుపై తెలుగు  తమ్ముళ్లు లోలోపల మదనపడుతున్నారు.టీడీపీ చరిత్రలోనే ఇంతటి ఘోర పరాజయం చూడలేదని ఫలితాలు భవిష్యత్ లో  కూడ పునరావృతం అయితే అధినేత  చంద్రబాబు పార్టీని నడపడం కన్నా రాజకీయాలకు గుడ్ బై చెప్పడం మేలని టీడీపీ సీనియర్లు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ చర్చించుకుంటున్నారూ. ప్రధానంగా రాష్ట్రంలో ఎన్నికల అనుసరించాల్సిన వ్యూహం,వైసీపీకి అడ్డుకట్ట వేయడానికి పోల్ మ్యానేజ్మెంట్ అంచనా వేయడం,పోలింగ్ జరిగే తీరుపై క్యాడర్ కు దిశానిర్దేశం చేయడం  లాంటి అంశాల్లో అధినేత  చంద్రబాబు విఫలమైయ్యారని టీడీపీలోని ఒక వర్గం నేతలు ఆరోపిస్తున్నారూ, రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులను అంచనా వేయకుండా ఎన్నికలకి వెళ్లి అధినేత  పార్టీని ఘోర పరాజయం చెందేలా చేసారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం రాష్ట్రంలో 13జిల్లాల పరిధిలో టీడీపీకి కంచు కోటలాంటి ప్రాంతాల్లో సైతం సొంత ఓటింగ్  జారవిడ్చు కోవడంతో పాటు  సొంత క్యాడర్ టీడీపీకి అనుకూలంగా మార్చుకోలేకపోయమని ఆందోళన చెందుతున్నారు.


అధినేత చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావించకుండా,ప్రజా సమస్యలపై పోరాటం చేయకుండా మీడియా సమావేశాలకు పరిమితం అయితే ఫలితాలు ఇలాగే ఉంటాయని టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నాయి.21నెలల కాలంలో  అధినేత ప్రజల్లోకి వెళ్లకుండా క్షేత్ర స్థాయిలోని  వాస్తవ పరిస్థితులను ప్రజల్లోకి వెళ్లి తెలుసుకోకుండా కేవలం కార్యాలయానికి పరిమితం అయితే ఫలితాలు ఇలాగే ఉంటాయని సెటైర్లు వేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు.రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం కొలువైన నాటి నుంచి ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావించడంలో అధినేత విఫలమయ్యారని ప్రతిపక్ష నేతగా శాసనసభలో సైతం చర్చలో పాల్గొనకుండా పదే పదే వాక్ అవుట్ చేయడం సభలో గందరగోళం సృష్టిస్తూ అసంబద్దమైన రీతిలో వ్యవహరించడం వల్ల ప్రజల్లో పార్టీ పట్ల,తమ అధినేత పట్ల విశ్వాసాన్ని కోల్పోయామని అందులో భాగంగానే ఎన్నికల్లో  ఇటువంటి ఫలితాలు పునరావృతం అవుతున్నాయని టీడీపీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి.మరోవైపు టీడీపీ ఓటమికి అధినేత విధానాలు ఒకెత్తు అయితే పార్టీలోని కొందరు నేతలు కూడా కారణమని ఒక వర్గం నేతలు ఆరోపిస్తున్నారు.రాష్ట్ర స్థాయిలో కీలకమైన పదవుల్లో ఉన్న నేతలు సైతం పార్టీ విధానపరమైన అంశాల్లో లోపాలను గుర్తించకపోవడం కూడా మరింత నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.ఇక టీడీపీలో కొందరు నేతలకె పార్టీలో పెద్ద పీట వేయడం నాయకత్వంపై అధినేత అజమాయిషీ లేకపోవడం,గ్రూపు వివాదాలను పరిష్కరించకపోవడం లాంటి అంశాల వల్ల పార్టీకి రాష్ట్ర స్థాయిలో భారీ ఎత్తున నష్టం వాటిల్లిందని తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు.


అధినేత,పార్టీలోని కొందరు నేతలు అధికార  వైసీపీ నేతలు పట్ల,ప్రజలు,కార్యకర్తల పట్ల వ్యవహరిస్తోన్న తీరు కూడా ఎన్నికల్లో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయేలా చేసిందని టీడీపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పార్టీలో నిర్మాణత్మక చర్చ జరపకుండా ఏకపక్షంగా నిర్ణయాలు,లోపాలను సరిచేసుకోకుండా కులాలు,మతాలు,ప్రాంతలూ అంటూ పదే పదే మీడియా వేదికల మీద అసభ్య పదజాలంతో దూషించడంతోనే టీడీపీకి ప్రజలు దూరమవుతున్నారని పార్టీలోని ఒక వర్గం నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో ఏ చిన్న ఘటన జరిగిన ప్రభుత్వానికి ఆపాదిస్తూ,కులం పేరుతో మతం పేరుతో పబ్లిసిటీ చేయడం వల్ల ప్రజల్లో చులకన భావం ఏర్పడిందని వీటిపై లోతుగా పరిశీలన చేయకుండా పబ్లిసిటీ కోసం పాకులాడటం,ఎన్నికల్లో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించకుండా ఎజెండా ఏమి లేకుండా ఓటర్లను బెదిరించడం కూడా పార్టీ ఓటమికి కరణమయ్యాయని ఇప్పటికైనా అధినేత తన తీరును మార్చుకోకపోతే పార్టీని మూసివేయడం బెటర్ అని తెలుగు తమ్ముళ్లు ఉచిత సలహాలు ఇస్తున్నారు.

ఇదిలా ఉంటె పార్టీలో నెలకొన్న అనేక అంశాలపై సీరియస్ గా ఉన్న టీడీపీ సీనియర్ నేత నేత బుచ్చయ్య చౌదరి అధినేత ముందు బలంగా చెప్పారట. పార్టీ బలోపేతం కంటే పబ్లిసిటీ కోసాము ప్రయత్నాలు చేసినన్ని  రోజులు టీడీపీ ఏపీలో బలపడలేదని బుచ్చయ్య చౌదరి  పబ్లిక్ గానే తన అక్కసును వెల్లగక్కారట మొత్తానికి ఎన్నికల ఫలితాలు తరువాత అధినేత తీరును మార్చుకోవాలని తెలుగు తమ్ముళ్లు వేడుకుంటున్నారు చూడాలి  ఫలితాలపై  అధినేత  తన తీరు మార్చుకుంటారో లేదో.


మరింత సమాచారం తెలుసుకోండి: