ఉత్త‌రాదిలో బ్రాహ్మ‌ణుల‌కు కానీ, ద‌ళితుల‌కు కానీ ఏకైక ప్రత్యామ్నాయం బీఎస్పీ అవుతుంద‌ని సంబంధిత నాయ‌కులు చెప్పు కుంటున్నారు. ఈ విధంగా ప్ర‌క‌ట‌న‌లు గుప్పించ‌డం ఇవాళ బీఎస్పీకి కొత్త కాదు కానీ బ్రాహ్మ‌ణుల‌కు అతి ద‌గ్గ‌ర‌గా ఉన్న పార్టీగా బీఎస్పీని ఎంత‌మంది గుర్తిస్తార‌ని? ద‌ళితుల‌కు మాయావ‌తి హ‌యాంలో ఆమె చెప్పిన విధంగా జ‌రిగిన మేలు ఎంత‌ని? ఇవ‌న్నీ ఓటు బ్యాంకు రాజ‌కీయాలే అని తేలిపోయాక బ్రాహ్మ‌ణులు కానీ ద‌ళితులు కానీ మళ్లీ బీఎస్పీకి మ‌ద్ద‌తుగా నిలుస్తారు అనుకోవ డంలోనే  అవివేకం దాగి ఉంది. బీజేపీ కానీ లేదా మ‌రో జాతీయ పార్టీ కానీ ఇవే మాట‌లు కాస్త తిప్పి తిప్పి రేప‌టి వేళ  చెప్ప‌వ‌చ్చు. అప్పుడు అన్ని పార్టీలూ అన్ని కులాల ప్రాధాన్యాన్ని పెంచుతూ పోతున్నాయా లేదా కొన్ని కులాల‌కే త‌మ‌ని ప‌రిమితం చేసుకు ని, మిగ‌తా కులాల‌ను మ‌రిచిపోతున్నాయా? ఇంత‌వ‌ర‌కూ బీఎస్పీ మేడ‌మ్ మాయావ‌తి చెప్పిన విధంగా బ్రాహ్మ‌ణులు, ద‌ళితు లు ఒకే వేదిక‌పై వ‌చ్చి ప‌నిచేసిన సంద‌ర్భాలు ఉన్నాయా? ఓ విధంగా త‌రాల అంత‌రాల‌కు కార‌ణం అయిన వారిని ద‌ళితులు న‌మ్ముతార‌ని ఎలా అనుకుంటారు? ఒక‌వేళ అనుకున్నా వ్య‌క్తుల స్థాయి, వారి ప్ర‌వ‌ర్త‌న‌కు అనుగుణంగానే ఓట్లేస్తారు త‌ప్ప ఆమె చెప్పిన ఈక్వేష‌న్లు వ‌ర్కౌట్ కావు.



వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు మార్చి, కొత్త ప్ర‌భుత్వం ఏర్పాటుకు స‌న్న‌ద్ధం అవుతున్నారు మాయావ‌తి. అగ్ర వ‌ర్ణాల‌నూ, ద‌ళితుల‌నూ ఏకం చేసి, ఒకే వేదిక‌పై నిలిపి అధికారంలోకి వ‌స్తే బాగుంటుంది అని క‌ల‌లు కంటున్నారు. వాస్త‌వానికి ఇది ఎంత వ‌ర‌కూ సాధ్య‌మో అన్న‌దే ప్ర‌శ్నార్థ‌కం. బ్రాహ్మ‌ణులు, ద‌ళితులు ప‌రస్ప‌ర స‌హ‌కారంతో ప‌నిచేసి బీఎస్పీని ఎందుకు ఎన్నుకో వాలి అన్నదే సిస‌లు ప్ర‌శ్న. బ్రాహ్మ‌ణులు కూడా నాయ‌కుల‌ను త‌యారు చేసుకుని, అందుకు మిగ‌తా వ‌ర్గాల మ‌ద్ద‌తు పొందేందుకు అవ‌కాశం ఉంది క‌దా! అప్పుడు బీఎస్పీ పార్టీ బ్రాహ్మ‌ణుల‌కు ప్ర‌త్యామ్నాయం అవుతుందా? ఎనాటి నుంచో వ‌ర్గ విభేదాలు, వ‌ర్ణ విభేదాలు కార‌ణంగా రాజ‌కీయాలు న‌డుపుతున్న వారు కులాల వారీగా క‌లుపుగోలు త‌నం ప్ర‌ద‌ర్శిస్తున్నారు అన్న‌ది వాస్తవం. అలాంట‌ప్పుడు ద‌ళితులంతా బీఎస్పీ వైపు ఎందుకు మొగ్గు చూపాలి. ఆ ప్రేమనో అభిమానాన్నో మ‌రో పార్టీపై కూడా పెంచుకోవ చ్చు. త‌మ‌ను సామాజిక అస‌మాన‌త‌ల కార‌ణంగా వెన‌క్క‌కు నెట్టిన కార‌కులు ఇప్పుడు కూడా త‌మ‌ను శాసిస్తున్నార‌న్న‌ది ద‌ళితుల వాద‌న. అలాంట‌ప్పుడు ఇప్ప‌టి అస‌మాన‌త‌ల‌కు కార‌ణం అయిన వ‌ర్గాల‌తో వారు ఎలా ప‌నిచేస్తారు.? మాయావ‌తి ఇవ‌న్నీ ఆలోచించ‌కుండా ఏక కాలంలో బ్రాహ్మ‌ణుల‌నూ, ద‌ళితుల‌నూ త‌న వైపు తిప్పుకోవాల‌ని చూస్తున్నారా?

మరింత సమాచారం తెలుసుకోండి:

bsp