వరి వేస్తే ఊరే... 60 లక్షల టన్నుల ధాన్యానికి మించి కేంద్రం ధాన్యం కొనేందుకు సిద్ధంగా లేదన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై బండి సంజయ్ ఫైర్ అయ్యారు. తన చేతగాని తనాన్ని కేసీఆర్ కేంద్రంపై నెడుతున్నారని ఆరోపించారు ఆయ‌న‌. కొల్చారం మండలం పోతంశెట్టిపల్లిలో చౌరస్తాలో బిజెపి ప్రజా సంగ్రామ యాత్ర బహిరంగ సభకు హాజరైన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఛత్తీస్ గడ్ మాజీ ముఖ్యమంత్రి రమన్ సింగ్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఈ సంద‌ర్భంగా బండి సంజ‌య్ మాట్లాడుతూ.. 60 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు పత్రాలపై సంతకం చేసిందే కేసీఆర్ అని ఎంత పంట వేస్తే అంత కొనాలని ఎందుకు అడగలేదని సీఎం కేసీఆర్‌ను ప్ర‌శ్నించారు.


రాష్ట్ర అవసరాల కోసం 20 లక్షల టన్నుల వడ్లను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాదా అని 60 లక్షలకే కేంద్రంతో ఒప్పందం ఎందుకు చేసుకున్నావో సమాధానం చెప్పాలి నిల‌దీశారు. రైతులకు దొడ్డు వడ్లు వేయ్యొద్ద‌ని కెసిఆర్ మాత్రం దొడ్డు వడ్లు పండించార‌ని చెప్పాడు. రైతు పండించిన ప్రతి గింజలను నేనే కొంటాను అని కేంద్రం తో సంభంధం లేదని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు కేంద్రం కొనను అంటుంది అని చెబుతూ కేంద్రప్రభుత్వాన్ని బ‌ద్నాం చేస్తున్నాడ‌ని మండి ప‌డ్డారు. మంచి అయితే త‌న‌ది చెడు అయితే కేంద్రానిది అని అంటార‌న్నారు.


లక్ష రూపాయల రుణ మాఫీ అని, రైతులకు యూరియా ఫ్రీ అని చెప్పి ఇంతవరకు ఎవరికీ ఇవ్వలేద‌ని గుర్తు చేశారు. ఆయుష్మాన్ భారత్ స్కీమ్ పనికిమాలిన స్కీమ్ అని చెప్పిన కేసీఆర్ మరి ఆరోగ్య శ్రీ లో కోవిడ్ ను ఎందుకు చేర్చలేద‌ని ప్ర‌శ్నించారు.  ప్రజలను కాపాడే హోం మినిస్టర్ మాకు కావాలని, చిన్నారుల పై లైంగిక దాడుల జరుగుతుంటే హోం మినిస్టర్ ఏం చేస్తున్నాడు మండిప‌డ్డారు. ఓల్డ్ సిటీ గురించి ఆలోచించే హోం మినిస్టర్ మాకు వద్దు.. యావత్ తెలంగాణ గురించి ఆలోచించే హోం మినిస్టర్ కావాలని డిమాండ్ చేశారు. గడీల పాలనను బద్దలు కొట్టడానికి, మూర్ఖుల  పాలన నుండి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడటానికి ఈ ప్రజా సంగ్రామ యాత్ర అని బండి సంజ‌య్ తెలిపారు.  ముస్లిం సోదరీమణుల కు న్యాయం చేయాలని ట్రిపుల్ తలక్ పై కేంద్రం చట్టం చేసింద‌ని దీనిపై కేసీఆర్ వైఖ‌రి ఎంటో చెప్పాల‌న్నారు.


  కేసీఆర్ పాల‌న అంత‌మొందాలి..

   చత్తీస్ గడ్ మాజి సీఎం రమన్ సింగ్ మాట్లాడుతూ.. కెసిఆర్ పాలనను అంతమొందించి పేదల పార్టీ బీజేపీ పాలన రావాలని కోరుకుంటున్నాన‌ని, అందుకు త‌న‌ వంతు సహకారం అందించడానికి వచ్చానని చెప్పారు అయ‌న‌. కెసిఆర్ ఓవైసీ సోదరుల మెప్పు పొందడానికి వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నార‌ని ఆరోపించారు. తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వ‌హించాల‌ని కేసీఆర్‌ను డిమాండ్ చేశారు ర‌మ‌ణ్ సింగ్. రాష్ట్రంలో లక్షా 35 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేయటం లేద‌ని వెంటనే వాటిని భర్తీ చేయాలన్నారు.


  ఎన్నిక‌లు వ‌స్తేనే ఉద్యోగ నోటిఫికేష‌న్లు..?

 సాగర్ ఎన్నికలకు ముందు ఉద్యోగాల నోటిఫికేషన్ వస్తుంది అని కెసిఆర్ చెప్పాడు. కానీ, ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ వేయ‌లేద‌ని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎన్నికలు వస్తేనే కేసీఆర్ కు ఉద్యోగ నోటిఫికేషన్ గుర్తోస్తుంద‌ని, ఇప్పుడు హుజూరాబాద్ ఎన్నికలు ఉన్నాయి కనుక మళ్ళీ ఉద్యోగ‌ నోటిఫికేషన్ వేస్తా అంటున్నాడ‌ని ఎద్దేవ చేశాడు.  కేంద్రం పెట్రోల్ దర పెంచింది అని హరీష్ రావు  అంటున్నాడ‌ని, కానీ ప్రతి లీటర్ పెట్రోల్ పై రాష్ట్ర పెభుత్వానికి  41/- రూపాయలు పన్నుల రూపంలో  వస్తున్నాయ‌ని వాటిని వద్దని చెబితే..  అప్పుడు లీటర్ పెట్రోల్ కేవలం 60/- రూపాయలకే ప్రజలకు అందుతుంద‌ని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: