తెలంగాణ సిఎం కెసిఆర్ మరో  సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  ఇతర  కులాల్లోని పేదల కు ఈ పది లక్షల సహాయం అందించాలనే ఆలోచన తెలంగాణ సిఎం కెసిఆర్  సమాచారం అందుతోంది.  వరుస క్రమం లో అందరికీ దళిత బంధు లాంటి పథకం అందించే యోచనలో గులాబీ బాస్ ఉన్నట్లు స్పష్టమైన సమాచారం అందుతోంది.   దళిత బంధు పథకం అమలు విషయం లో  మిగతా వర్గాలు సహకరించాలని.. ఈ నేపథ్యం లోనే అన్నీ కులాలకు సహాయం చేసే దిశగా తెలంగాణ సర్కార్ అడుగులు వేస్తూ న్నట్లు సమాచారం అందుతోంది. 
 
వచ్చే ఏడాది నుంచి బడ్జెట్ లో దళిత బంధు పథకం కోసం రూ. 20 వేల కోట్లు పెట్టె యోచనలో ఉంది టిఆర్ఎస్ సర్కార్.  సంవత్సరానికి  రెండు లక్షల  దళిత కుటుంబాలకు ఈ పథకం వర్తింపు ఉండేలా ఆలోచన చేస్తోంది సర్కార్.  పరిస్థితులు అనుకూలిస్తే ఇంకా నిధులు పెంచుకుంటూ పోయే దిశగా తెలంగాణ సర్కార్ అడుగులు వేస్తూ న్నట్లు సమాచారం అందుతోంది. తెలంగాణ ఏర్పడినప్పటి నుండి అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేశామని..   రైతు బంధు సహా ఇతర పథకాలు అమలు చేసినప్పుడు దళితులెవరూ అభ్యంతరం చెప్పలేదని నిన్న ప్రగతి భావన లో జరిగిన సమావేశం   సీఎం కెసిఆర్ అన్నట్లు సమాచారం అందుతోంది.

కాకపోతే తమకు కూడా మేలు చేయాలని మాత్రమే దళిత జాతి ప్రజలు కోరుకున్నారని  చెప్పారట సీఎం కెసిఆర్.  కాగా హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక ఈ నేపథ్యంలో దళిత బంధు పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం తీసుకు వచ్చినట్లు... గత కొన్ని రోజులుగా విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఏదిఏమైనా ఈ దళిత బంధు పథకం ద్వారా ఒక దళిత కుటుంబానికి ఏకంగా 10 లక్షల రూపాయలు ఇవ్వాలని  కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గం లో రెండు వేల కోట్లు ఈ పథకం అమలు కోసం విడుదల చేసింది ప్రభుత్వం. అలాగే మరో నాలుగు నియోజకవర్గాలలో దళిత బంధు  అమలుకు కసరత్తు చేస్తోంది తెలంగాణ సర్కార్.


మరింత సమాచారం తెలుసుకోండి: