కరోనా సమయంలో వైద్యరంగం చేసిన సేవలు మరువలేనివి. ఈ సమయంలోనే వైద్యుల కొరత కూడా చాలా చోట్ల బాగా తెలుస్తుంది. దీనితో దేశంలో వైద్య విద్య సీట్లు పెంచాలని ఆ రంగం సిఫారసు కూడా చేసింది. దీనికి కేంద్రం ఒప్పుకోవడంతో ఆయా వైద్య కళాశాలలలో సీట్ల సంఖ్య ఘననీయంగా పెరిగిపోయింది. అనుబంధ విద్యలను కూడా అదే స్థాయిలో ప్రోత్సహించాలని దానికి కూడా అడుగులు వేయడం ప్రారంభించారు. తాజాగా ఈ నిర్ణయంతో ఏపీలో వైద్య విద్యలో పీజీ చేయాలనే వారి ఆశలు నెరవేర్చేలా సీట్ల సంఖ్యను రెండింతలు చేసింది ప్రభుత్వం. గతంలో ఈ విద్యార్థులకు 1008 సీట్లు మాత్రమే అందుబాటులో ఉండగా ప్రస్తుతం వాటికి తోడుగా 939 సీట్లు పెంచారు.

ఈ మేరకు గుంటూరు, నెల్లూరు, ఒంగోలు, కాకినాడ, శ్రీకాకుళం ప్రభుత్వ వైద్య కళాశాలలలో భారీగా సీట్లు పెరగనున్నాయి. ఈ సీట్ల పెంపుకు ముందు ఆయా ఆసుపత్రులలో అదనపు పడకలకు మరియు ఇతర సిబ్బంది నియామకానికి అనుమతి లభించాల్సి ఉంది. బోధన ఆసుపత్రులలో పడకల సంఖ్య 11274 ఉంది. ఆయా అత్యవసరాలకు అనుగుణంగా వీటి సంఖ్య 13376  కు పెరిగింది. దీనిప్రకారంగా 2102 పడకలకు అనుమతి లేదని తేలింది. తాజా అంచనా ప్రకారం అదనంగా 7783 పడకలు కావాల్సి ఉంది. బోధన ఆసుపత్రులలో యూనిట్లే ముఖ్యం కనుక ప్రస్తుతం వీటి సంఖ్య 377గా ఉంది. ఇందులో ఒక్కో యూనిట్ కు ప్రొఫెసర్, ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్, ముగ్గురు అసిస్టెంట్ ప్రొఫెసర్ లు ఉంటారు. పెంచిన సీట్లకు అనుగుణంగా యూనిట్ల సంఖ్య కూడా 184 కు పెంచాల్సిన అవసరం ఉంది.

సాధారణంగా అయితే జనాభా ప్రాతిపదికన పడకలు మరియు యూనిట్ల పెంపు జరుగుతూ ఉండాలి, కానీ గత ఐదేళ్లుగా అలాంటివి ఏమి జరగకపోవటంతో భోదన ఆసుపత్రులపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడి జరగాలంటే అవసరానికి తగ్గట్టుగా సీట్లు పెంచుకుంటూ పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సిబ్బందిని కూడా తదనుగుణంగా పెంచుకోవాల్సి వస్తుంది. దీనివలన సూపర్ స్పెషాలిటీ సీట్లు కూడా మరో 33వరుకు పెంచుకోవచ్చు. ప్రస్తుతం ఈ అంచనాలను ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. ఇది అమలు అయితే విస్తృతమైన వైద్యసేవలు అందుబాటులోకి రాగలవు.

మరింత సమాచారం తెలుసుకోండి: