భద్రతకు భరోసా ఇచ్చే రాష్ట్రంగా ఏపీ ఎందుకనో వెనుకంజలోనే ఉంది. మహిళలకు, దళితులకు సంబంధించి నమోదయిన కేసు లు వాటి వివరాలు కాస్త ఆందోళనలకు తావిస్తున్నాయి. అయినప్పటికీ జగన్ ప్రభుత్వం ఎన్ని సార్లు అడిగినా దిశ చట్టం గురించే మాట్లాడుతుంది తప్ప! మిగతా అంశాలలో పోలీసులను అప్రమత్తం చేసిన దాఖలాలు లేవన్న ఆరోపణలు విపక్షం చేస్తోంది.


మహిళలపై ఆంధ్రావనిలో జరిగే నేరాల పరంగా చూస్తే దేశంలో పదో స్థానంలో ఉంది. 2019లో మహిళలపై నేరాలు 17,089 జరగగా, కిందటి ఏడాది ఆ సంఖ్య 17,746 అని తేలింది. ఇక దళితులపై నమోదు అవుతున్న కేసులు, వారిపై జరుగుతున్న దాడులు ఇవ న్నీ ఆందోళనకర స్థాయిలోనే ఉన్నాయి. ఇదే సందర్భంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, నేరాల కట్టడిపై పెడుతున్న శ్రద్ధ అన్న వాటిపై పలు అనుమానాలు రేగుతున్నాయి. విమర్శలు వస్తున్నాయి.



దళిత బంధు పేరిట ఓ వైపు పక్క రాష్ట్రం పథకాలను తీసుకువస్తోంది. మరోవైపు ఆంధ్రావనిలో పథకాలు తీరు ఎలా ఉన్నా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. జాతీయ నేర గణాంక నివేదిక ఆధారంగా ఎస్సీలపై 2018లో 1836 కేసులు నమోదయ్యాయని, 2019లో 2071 కేసులు నమోదయ్యాయని, 2020 లో కేసుల  సంఖ్య కాస్త తగ్గినా ఆ తగ్గుదల కూడా పెద్దగా ఆశించిన రీతిలో లే దని తేలిపోయింది. లక్ష జనాభా ఉన్న ఎస్సీలకు 23.1 నేరాలు జరిగాయి అని తేలింది. దళిత మహిళలపై దాడులు జరుగు తున్న తీరులో ఆంధ్ర ఐదో స్థానంలో ఉంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర ముందున్నాయి. ఐపీసీ కింద నమోదయిక కేసుల వివరం ప్రకారం 2019తో పోలిస్తే 2020లో కేసుల సంఖ్య పెరుగుదల శాతం 58.51గా ఉంది. స్పెషల్ ఎండ్ లోకల్ లా కింద నమోదయిన కేసులలో 2019తో పోలిస్తే 2020లో కేసుల సంఖ్య పెరుగుదల 85.15శాతంగా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

ap