సాధారణంగా దూర ప్రాంతాలకు వెళ్లాలి అనుకునేవారు ఎక్కువగా బస్సు సర్వీసులను ఆశ్రయిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే చాలామంది కేవలం ఆర్టీసీ పైనే ఆధార పడుతూ ఉంటారు. ఎందుకంటే ప్రైవేట్ ట్రావెల్స్ కు సంబంధించిన సర్వీసులు అందుబాటులో ఉన్నప్పటికీ.. ఆర్టీసీ తో పోల్చి చూస్తే కాస్త సౌకర్యాలు ఎక్కువగానే ఉన్నప్పటికీ.. ప్రైవేట్ ట్రావెల్స్ లో ప్రయాణం ఏమాత్రం సౌకర్యం కాదు అని భావిస్తూ ఉంటారు. అదే సమయంలో  అటు ప్రైవేట్  ట్రావెల్స్ లో ప్రయాణించాలి అంటే భారీ మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. అది సామాన్య ప్రజలకు భారంగా మారుతుంది అని చెప్పాలి.



 కానీ అటు ఆర్టీసీలో మాత్రం దూర ప్రయాణాలకు కూడా ఎంతో సూత్రప్రాయ మైనా టికెట్ ధరలు అందుబాటులో ఉంటాయ్. దీంతో సామాన్య ప్రజలందరూ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే దూరప్రాంత సర్వీసుల కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు తీసుకుని టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇలా టికెట్ బుక్ చేసుకున్న సమయంలో ప్రతి ఒక్కరి రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి ఒక ఎస్ఎంఎస్ పంపిస్తూ ఉంటుంది ఆర్టీసీ సంస్థ. ఇక ఈ  మెసేజ్ లో అటు టికెట్ కు సంబంధించిన పూర్తి సమాచారం ఉండడంతో పాటు అటు ఆర్టీసీ డ్రైవర్ యొక్క నెంబర్ కూడా ఉంటుంది అనే విషయం తెలిసిందే.



 ఏదైనా సమాచారం తెలుసుకోవాలంటే అటు ప్రయాణికులు ఆర్టీసీ డ్రైవర్ కు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఇటీవల ఇలా డ్రైవర్ నెంబర్ పంపే విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకుంది ఏపీఎస్ఆర్టీసీ.  ఇకనుంచి ప్రయాణికులకు పంపే మెసేజ్ లో డ్రైవర్ నెంబరు ఇవ్వకూడదని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. డ్రైవరు, ప్రయాణికుల భద్రత దృశ్య ఆర్టీసీ సెంట్రల్ కంప్లైంట్ హెల్ప్ లైన్ నెంబర్ 08662570005 మాత్రమే ఇక మెసేజ్ లో పంపనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇక ఆదేశాలు కూడా జారీ చేసింది ఏపీఎస్ఆర్టీసీ.

మరింత సమాచారం తెలుసుకోండి: