ఒక పోర్టు వంద‌ల సందేహాలు అన్న రీతిలో రాష్ట్రంలో ప‌రిణామాలు నెల‌కొంటున్నాయి. అధికారంలోకి రాగానే జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యాల ప్ర‌భావం  ఇప్పుడిప్పుడే వెలుగులోకి వ‌స్తున్నాయి. విద్యుత్ కొనుగోలులో నెల‌కొన్న త‌ప్పిదాలు మొద‌లుకుని, పోర్టు ప‌నులు చేప‌ట్ట‌లేక‌పోవ‌డం వ‌ర‌కూ అన్నీ అస‌మ‌ర్థ‌త‌కు ఆన‌వాలుగానే ఉన్నాయి.



సొంత మ‌నుషుల‌కు నిర్మాణ సంస్థ‌లు ఉన్నా కూడా ఎవ్వ‌రూ ముందుకు రావ‌డం లేదు. రాంకీ సంస్థ అధినేత అయోధ్య రామిరెడ్డి గ‌తంలో ఝార్ఖండ్ లో కాంట్రాక్టులు ద‌క్కిం చుకున్న అనుభ‌వం ఉంది. అంతెందుకు జ‌గ‌న్ పార్టీ మ‌నుషులు కొంద‌రు నిర్మాణ సంస్థ‌లు న‌డుపుతున్నా కూడా మాకెందుకు గొడవ అని విలువైన ప‌నులు, కోట్ల రూపాయ‌లు చేతులు మారే ప‌నులు అస్స‌లు తీసుకోకూడ‌దు అని నిర్ణ‌యించుకున్నార‌ని స‌మాచారం. ముఖ్యంగా రాజ‌కీయ జోక్యం అతి చేస్తున్న కార‌ణంగానే ప‌నులు ఎవ్వ‌రూ అందుకోవ‌డం లేద‌ని కూడా తేలిపోయింది.



డ‌బ్బులున్నాయి కానీ ప‌నులు మాత్రం కావు. నిధులున్నా కూడా ప్ర‌భుత్వం కు మాత్రం కాంట్రాక్ట‌ర్లే దొర‌క‌డం లేదు. సంక్షేమ జ పం చేస్తున్న ప్ర‌భుత్వానికి కొత్త ప‌నులు చేప‌ట్ట‌డంలో ఏమంత ఆస‌క్తి లేద‌ని తేలిపోయింది. గ‌త ప్ర‌భుత్వంలో ఉన్న బ‌కాయిలు వై సీపీ ప్ర‌భుత్వం క్లియ‌ర్ చేయ‌క‌పోవ‌డంతో ఎందుకు వచ్చిన గొడ‌వ అని వ‌దిలేస్తున్నారు. కాంట్రాక్టులు ద‌క్కించుకునే సంస్థ‌లు ఏపీ వైపు పెద్ద‌గా ఆసక్తి  చూప‌డం లేదు. భారీ ప్రాజెక్టుల‌పై ఇటువంటి నిరాస‌క్త‌త ఎందుక‌ని అంటే జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై సంబంధిత సంస్థ ల‌కు న‌మ్మ‌కం లేక‌పోవ‌డ‌మే ప్ర‌ధాన కార‌ణం.



దీంతో వైసీపీ స‌ర్కారుకు మ‌రో నిరాశ ఎదురైంది. ఇప్ప‌టికే అభివృద్ధి ప‌నుల‌పై ఎటు వంటి దృష్టి లేద‌న్న విమ‌ర్శ‌ల‌కు ఇదొక ఊతం కా నుం ది. మ‌చిలీప‌ట్నం పోర్టుకు సంబంధించి టెండ‌ర్లు పిలిచినా కూడా ఎవ్వ‌రూ స్పందిం చ‌లేదు. దీంతో జ‌గ‌న్ వ‌ర్గాలు త‌ల‌లు ప‌ట్టుకుం టున్నాయి. ప్ర‌స్తుత ప్ర‌భుత్వ హ‌యాంలో  ప‌నులు చేసినా పైస‌లు రావ న్న అభిప్రా యం కాంట్రాక్ట‌ర్ల‌లో బ‌లంగా నెల‌కొనడంతో టెండ రింగ్ ప్రాసెస్ కు ఎవ్వ‌రూ ముందుకు రావ‌డం లేదు. 5835 కోట్ల రూ పాయ‌ల‌తో చేప‌ట్టాల్సిన ప‌నులు నిధులున్నా కూడా ముందు కు వెళ్ల‌డం లేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

ap