బీహార్ రాష్ట్రంలో లో మామూలు ప్రజల బ్యాంకు ఖాతాల్లో కోట్ల రూపాయలు జమ కావడం కలకలం రేపింది. ఇటీవలె ఇద్దరూ చూడండి అకౌంట్ లో ఏకంగా తొమ్మిది వందల అరవై కోట్లు జమ అయ్యాయి. ఈ ఘటన మరువక ముందే మరో ఘటన వెలుగు చూసింది. బీహార్ రాష్ట్రంలోని ఓ మామూలు రైతు బ్యాంకు అకౌంట్ లో ఏకంగా యాభై రెండు కోట్లు జమయ్యాయి. పింఛన్ డబ్బుల కోసం వెళ్లిన రైతు కు... బ్యాంకు అధికారులు ఈ విషయాన్ని గుర్తించారు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే... బీహార్ రాష్ట్రంలోని ముజఫరపూర్ జిల్లాలో లో రాము బహదూర్షా అనే రైతు నివసిస్తున్నాడు.  పింఛను కోసం  కొన్ని సంవత్సరాల క్రితం ఓ బ్యాంకు అకౌంట్ ను ఓపెన్ చేశాడు రాం బహదూర్ షా.  

అయితే తాజాగా పింఛను డబ్బుల కోసం.. స్థానిక బ్యాంకు లోకి వెళ్ళాడు రామ్ బహదూర్ . ఈ నేపథ్యంలో రామ్ బహదూర్  అకౌంటు వివరాలను చూసిన అధికారులు షాక్ కి గురయ్యారు. రామ్ బహదూర్ అకౌంట్ లో ఏకంగా 52 కోట్లు ఉన్నట్లు ఆ బ్యాంకు అధికారులు గుర్తించారు. ఈ విషయం స్థానికంగా కలకలం రేపింది. దీంతో అక్కడి జనాలు ఒక్కసారిగా గుంపులుగా... రామ్ బహదూర్ దగ్గరికి వచ్చారు.ఇక బ్యాంక్ ఖాతాలో డబ్బులు పడిన అనంతరం... రామ్ బహదూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. " నా అకౌంట్ లో డబ్బులు పడటం చాలా ఆనందంగా ఉంది మరియు ఆశ్చర్యకరంగా కూడా ఉంది. నేను వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాను. పొట్ట గడవడం కష్టంగా ఉంటుంది. ప్రభుత్వం ఇస్తున్న పింఛన్ పై నా జీవితం ఆధారపడి ఉంది.  

కానీ ఒక్కసారిగా ఇంత మొత్తంలో డబ్బులు పడటం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ప్రభుత్వం వన్ అండ్ అబ్బులు నిజంగానే నాకు ఇస్తే నా జీవితం బాగుంటుంది."అంటూ పేర్కొన్నాడు రామ్ బహదూర్. ఇక ఈ ఘటన పై అధికారుల సమాచారం మేరకు పోలీసులు కేసు బుక్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పై అధికారులకు కూడా సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అసలు ఇంత భారీ మొత్తంలో డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు వేశారు ? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: