జనసేన పోరాడినా పోరాడకపోయినా ప్లాంటు అమ్మకం ఆగదు. కేవలం పవన్ మాట్లాడి వెళ్లిపోతే అది కుదరని పని. కొన్ని రోజు లుగా ఇవే మాటలు సీపీఎం, సీపీఐ కూడా చెబుతున్నాయి. వారి మాటలకు విలువ ఇవ్వరని తీసిపడేయలేం. బృందా కారత్ లాంటి నేతలు కూడా వీరి పక్షానే ఉన్నారు. కానీ ప్లాంటు నిరసనలు కేంద్రానికి వినపడడం లేదు. జనసేన పోరు తీవ్రం చేస్తే కొన్ని రోజులు ఆగితే ఆగవచ్చు కానీ అదే అంతిమ పరిష్కారం కాదు. స్టీలు ప్లాంటు అమ్ముకుని తమ వారికి ప్లాంటు అప్పగించేందుకు చాలా ప్రయత్నాలు కేంద్రం చేస్తోంది. కొన్ని కార్పొరేట్ కంపెనీలు ఈ కంపెనీని దక్కించుకుని, ప్లాంటులో మార్పులు చేసేందుకు కూడా యోచిస్తున్నాయి. అలాంటప్పుడు జనసేన మాట్లాడినా ప్రయోజనం ఉండదు.


విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆ రోజు నినదించిన వారంతా ఇప్పుడు నిశ్శబ్దం అయిపోయారు. స్టీల్ ప్లాంట్ అమ్మకం నిర్థారణ అయిపోయాక పోరాటం ఫలిస్తుందా లేదా అన్నది సందేహంగా ఉంది. ముఖ్యంగా కేంద్రం ఈ విషయమై పెద్దగా వెనక్కు తగ్గేలా లే దు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పైకి కబుర్లు చెప్పినప్పటికీ లోలోపల జగన్ మోడీ సమన్వంతోనే  ఉన్నారు అన్న వాదన కూడా ఉంది. ఈ దశలో ప్లాంటు ప్రయివేటీకరణను ఆపడం అంత సులువు కాదు. ఒకవేళ ఆపినా ఎన్నికల స్టంటుగా మార్చుకునేందుకు బీజేపీ ప్రయత్నించవచ్చు. జనసేన రంగంలోకి వచ్చినప్పటికీ కేంద్ర పెద్దలు తాము అనుకున్నది ఆపు చేయడం అన్నది కుదరని పని. ఒకవేళ నిలుపుదల చేసినా క్రెడిట్ కొట్టేసేందుకు ప్రతి రాజకీయ పార్టీ వెంపర్లాడతాయి. దీంతో దీన్నొక రాజకీయ సమస్యగానే చూస్తా రు తప్ప సామాజిక ఉద్యమ సమస్యగా చూడరు. సామాజిక ఉద్యమ సమస్యగా చూడనంత కాలం సమస్య పరిష్కారం కాదు.

మొదట నుంచి నష్టాల పేరుతో స్టీల్ ప్లాంట్ అమ్మేయాలని బీజేపీ అనేక ప్రయత్నాలు చేస్తోంది. అయితే దేశానికి ఎన్నో సేవలు అందించిన స్టీల్ ప్లాంట్ అమ్మేయడంతోనే కేంద్రం చేతులు దులుపుకుంటే అంత కన్నా అవివేకం లేదు. ఉద్యోగుల భవిష్యత్తు, వారి ఆర్థిక స్థితిగతులు ఇవేవీ పట్టించుకోకుండా ప్లాంటు అమ్మేయడం అన్నది నిజంగానే అసమర్థతకు సంకేతం కావొచ్చు.  ఈ దశలో బీజేపీ మళ్లీ ఆలోచన చేయాలి. ఉద్యోగులను ఆదుకోవడంలో ఏమయినా చర్యలు తీసుకోగలదా అన్నది రేపటి వేళ ఉపయోగపడే ప్రశ్న. కానీ బీజేపీ మాత్రం భిన్నంగా ఆలోచిస్తుంది. ఆస్తులను అమ్ముకుని తాము సేఫ్ జోన్ లో ఉండాలని భావిస్తోంది. ముఖ్యంగా  విశాఖ స్టీలు ప్లాంటు ఆస్తుల కొనుగోలుపైనే బీజేపీ  పెద్దలు కన్నేసి ఉంచారని, దీనికి వైసీపీ నాయకుల సాయం కూడా  ఉందని కొన్ని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆస్తులను తమ ఖాతాలో వేసుకుంటే ఎటువంటి ఇబ్బందీ ఉండదని, భవిష్యత్ రాజకీయంను శాసించే శక్తి తమకు వస్తుందని బీజేపీ భావించి, స్టీలు ప్లాంటు అమ్మకంపై కన్నేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: