టీడీపీ అధినేత‌, మాజీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలోనే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో టీడీపీకి ఘోర‌మైన ఫ‌లితాలు వ‌చ్చాయి. నియోజ‌క‌వ‌ర్గంలోని నాలుగు జ‌డ్పీటీసీల‌ను వైసీపీ గెలుచుకుంది. దాదాపు 90 శాతం ఎంపీటీసీ లు కూడా వైసీపీ ఖాతాలో ప‌డ్డాయి. అన్నింటికి మించి దారుణంగా చంద్ర‌బాబు స్వ‌గ్రామం నారా వారి ప‌ల్లె ఎంపీటీసీ ని కూడా వైసీపీ గెలుచుకుంది. ఇక పంచాయ‌తీల్లో కూడా 90కు 75 పంచాయ‌తీలు వైసీపీ ఖాతాలోనే ప‌డ్డాయి. ఇక ఇప్పుడు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌లో ఆ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఈ ఘోర మైన ఓట‌మికి కార‌ణం ఏంట‌న్న‌ది ప్ర‌శ్నించుకుంటే అక్క‌డ పార్టీ త‌ర‌పున బాబు కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించిన వారే చంద్ర‌బాబు కొంప ముంచేశార‌ని అంటున్నారు.

చంద్రబాబు ఇప్పటి వరకూ కుప్పం నియోజకవర్గం నుంచి ఏడుసార్లు విజయం సాధించ‌డంతో పాటు వ‌చ్చే ఎన్నిక‌ల‌లో ఎనిమిదో సారి కూడా అక్క‌డ నుంచే పోటీకి రెడీ అవుతున్నారు. చంద్ర‌బాబు సీఎం అయ్యాక కుప్పం విష‌యంలో ఆయ‌న ఎప్పుడూ పెద్ద‌గా టెన్ష‌న్ ప‌డింది లేదు. అయితే గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న మెజార్టీ త‌గ్గిన ప్ప‌టి నుంచే ఆయ‌న కు కుప్పం విష‌యంలో మాత్రం ఎక్క‌డా లేని టెన్ష‌న్ స్టార్ట్ అయ్యింది. అక్క‌డ బాబు ఎప్పుడూ త‌న త‌ర‌పున మనోహర్ అనే పీఏతో వ్యవహారం నడిపేవారు.

బాబు సీఎంగా ఉన్నా కూడా కుప్పంను ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయ‌లేదు. జ‌గ‌న్ సీఎం అయ్యాక కుప్పంను న‌గ‌ర పంచాయ‌తీని చేశారు. ఇక బాబు అక్క‌డ నియ‌మించుకున్న ఇన్ చార్జ్‌లు కూడా చేతివాటం చూపుతూ సొంత పార్టీ కేడ‌ర్ నుంచే డ‌బ్బులు గుంజుతున్నార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. బాబు వీటిని క‌ట్ట‌డి చేయ‌లేక‌పో యారు. అందుకే స్థానిక ఎన్నిక‌ల‌లో పార్టీ ఘోరంగా ఓడిపోయింది. చంద్ర‌బాబు ఇప్ప‌టి నుంచే అలెర్ట్ గా లేక‌పోతే వ‌చ్చే ఎన్నిక‌ల‌లో కుప్పం ప్ర‌జ‌లు ఆయ‌న‌కు షాక్ ఇచ్చినా ఆశ్చ‌ర్య పోన‌క్క‌ర్లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: