తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ మరియు ఆర్టీసీ ఛార్జీల పెంపునకు కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం  అందుతోంది. ఇందులో భాగంగానే ఛార్జీల పెంపుపై గులాబీ బాస్ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూడా కొన్ని సంకేతాలు ఇచ్చారు. విద్యుత్తు మరియు ఆర్టీసీ చార్జీల పెంపుదలపై... మరోసారి భేటీ అయ్యే కేబినేట్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామని కుండ బద్దలు కొట్టారు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు. రవాణా శాఖ మరియు విద్యుత్ శాఖ మంత్రులు, ఇతర ఉన్నతాధికారులతో నిన్న రాత్రి ఇళ్లకు సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ సందర్భంగా పలు కీలక ఆదేశాలు చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్. 

తెలంగాణ ఆర్టీసీ లాభాల బాటలోకి తీసుకువచ్చేందుకు రెండు సంవత్సరాల కింద చర్యలు తీసుకున్నామని... నష్టాల్లో ఉన్న ఆర్టీసీని తిరిగి లాభాల్లోకి తీసుకు వచ్చే ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభించామని పేర్కొన్నారు. ఆర్టీసీ గాడిలో పడుతున్న నేపథ్యంలో... కరుణ మహమ్మారి మరియు డీజిల్ ధరల రేట్లు పెరగడం కారణంగా మళ్లీ నష్టాల బాట పట్టింది అని ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. కరోనా సంక్షోభం మరియు డీజిల్ ధరలు పెరగడం కారణంగా ఆర్టీసీకి ఈ పరిస్థితి ఎదురైందని వెల్లడించారు. అలాగే విద్యుత్ సంస్థల పరిస్థితి పైన కూడా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సమీక్ష నిర్వహించారు.

కరోనా మహమ్మారి  కారణంగా విద్యుత్ సంస్థలు కూడా చాలా  నష్టాల్లోకి నెట్టి వేయబడ్డాయని... ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు విన్నవించారు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మరియు విద్యుత్ అధికారి ప్రభాకర్ రావు. ఆరు సంవత్సరాలుగా విద్యుత్ చార్జీలను మనం సహకరించలేదని... ఈసారి కచ్చితంగా చార్జీలను పెంచాల్సిన అవసరం ఉందని వారు సీఎం కేసీఆర్ కు తెలిపారు. అయితే ఆ డిమాండ్లపై ముఖ్యమంత్రి కెసిఆర్ స్పందిస్తూ... ఆర్టీసీ మరియు విద్యుత్ చార్జీల పెంపుపై త్వరలో భేటీ అయ్యే కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ నిర్ణయం తో ఆర్టీసీ మరియు విద్యుత్ చార్జీలు పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: