కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల మహాదీక్ష లో ఈటల రాజేందర్ పాల్గొని కీలక వ్యాఖ్యలు చేసారు. 2009 కేసీఆర్ దీక్ష విరమణ జరిగిన వార్త కేయు 2వ గేటు వద్ద విన్నాను అని ఆయన గుర్తు చేసుకున్నారు. నీళ్లు నిధులు నియామకాల పేరుతో తెలంగాణ ఉద్యమం జరిగింది అని ఆయన తెలిపారు. విద్యార్థి లోకం జాక్ గా ఏర్పడి దీక్షలు చేశారు అని ఆయన అన్నారు. 3 తరాల ఉద్యమానికి సజీవసాక్షి ప్రొఫెసర్ జయశంకర్ అని ఆయన పేర్కొన్నారు. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఆశించిన దిశగా సాగుతలేదు అని ఆయన విమర్శలు చేసారు.

విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందో పాలకులు ఒకసారి ఆలోచించాలి అని సూచించారు. మన రాష్ట్రంలో ఎన్నికల కోసమే కొన్ని పథకాలు తీసుకువస్తారు అని ఆయన పేర్కొన్నారు. ఏరోజు అంబేద్కర్ జయంతికి పూల మాల కూడా వేయని కేసీఆర్ కేవలము హుజురాబాద్ ఎన్నికల కోసమే దళితబంధు స్కీం తీసుకొచ్చారు అని వ్యాఖ్యలు చేసారు. గొల్ల కురుమల కోసం తీసుకొచ్చిన గొర్రెల పంపిణీ కూడా బ్రోకర్ల చేతికి వెళ్ళింది అని మేధావులు ఈలెక్క తేల్చాలి అని ఆయన కోరారు.

విద్యార్థులు చేసే ఉద్యమాలకు ప్రజల మద్దతు ఉంటుంది అని అన్నారు. పిడికెడు మంది చేతుల్లో ఈదేశ సంపద బందీ అయ్యింది అని ఆయన వ్యాఖ్యానించారు. విశ్వవిద్యాలయం లో కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను నియమించుకోవాల్సిన దౌర్భాగ్యం పట్టింది అని మండిపడ్డారు. హుజురాబాద్ లో ఎలా గెలవాలి అనే ఆలోచన తప్ప విద్యార్థులకు మంచి చేయాలనే ఈ సర్కార్ కు లేదు అని ఆయన వ్యాఖ్యానించారు. 20వ తేదీ వచ్చినా ముసలి తల్లులకు పెన్షన్ కూడా ఇవ్వలేని దుస్థితి మన ధనిక రాష్ట్రం లో వచ్చింది అని విమర్శించారు. మీరు చేసే దౌర్జన్యాలు ఎల్లకాలం సాగవు అని వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ ఆకలినైన బరిస్తది కానీ ఆత్మగౌరవం కోల్పోదు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: