తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ పరిస్థితి చాలా దారుణంగా తయారయింది. కనీసం కార్మికులకు జీతాలు ఇవ్వడానికి కూడా బడ్జెట్ లేని పరిస్థితి ఏర్పడింది. ఒక సంవత్సరం కింద ఆర్టీసీ కార్మికులంతా నెల రోజులకు పైగా సమ్మె చేపట్టారు. ఈ యొక్క సమ్మె తర్వాత కరుణ వ్యాధి విజృంభణ దీంతో ఆర్టీసీకి మరుగుతున్న నక్కమీద తాటిపండు పడ్డట్టు అయింది. దీంతో ఆర్టీసీని తెలంగాణ ప్రభుత్వం ప్రైవేటు పరం చేయాలని భావిస్తోంది. కానీ దానికి కార్మికులు  వెంకట చెబుతున్నారు. దీంతో ప్రభుత్వం చర్చలు జరిపి  ఒక నిర్ణయానికి వచ్చింది. నాలుగు నెలల్లో ఆర్టీసీ వ్యవస్థ మొత్తం గాడిన పడకపోతే ప్రైవేట్ పరమే చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు.

 టి ఎస్ ఆర్ టి సి ఎదుర్కొన్న ఎటువంటి ఇబ్బందులు, దానికి పుర వైభవం తీసుకురావడానికి తీసుకోవాల్సిన టువంటి చర్యలపై సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఒక సమావేశంలో రవాణా శాఖ మంత్రి అయిన పువ్వాడ అజయ్ కుమార్, ఎండి సజ్జనార్, చైర్మన్లు బాజిరెడ్డి గోవర్ధన్, ఒక సమావేశంలో పాల్గొని చర్చించారు. ఆర్టీసీని కాపాడాలని లక్ష్యంతో ప్రభుత్వం అనేక సార్లు  ఆదుకుంటూ వచ్చిందని, ఈ సంవత్సరం  కూడా ఆర్టీసీ ప్రణాళిక కోసం మూడు వేల కోట్ల రూపాయలు కేటాయించిందని, అయినా ఆశించిన ఫలితాలు రాకపోవడంతో సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది అందరూ కలిసికట్టుగా చేస్తే సాధ్యం అవుతుందని దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు నిర్దేశించినట్లు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్  తెలియజేశారు. మరో నాలుగు నెలల గడువు  ప్రభుత్వం ఆర్టీసీకి కేటాయించింది.

ఈ సమయంలోనే  ఆర్టీసీని గాడిలోకి తీసుకురావాలని స్పష్టం చేశారు సీఎంవో.. కరోనా వైరస్ తో పాటుగా ఎటువంటి డీజిల్ పెట్రోల్ ధరలకు ఆర్టీసీ నష్టపోవడానికి మరింత కారణమైందని వారు వివరించారు. అధికారులు కార్యాలయాల్లో కూర్చుని పనులు చేస్తే కుదరదని, క్షేత్ర స్థాయిలోనూ పర్యటించి సమస్యలను తెలుసుకొని ముందుకు పోతేనే అంత బాగా అవుతుందని ఆర్టీసీ అధికారులకు దిశానిర్దేశం చేశారు. కార్యాలయంలో కూర్చుని ఉంటే క్షేత్రస్థాయిలో సమస్యలనేవి పూర్తి కావాలని, ప్రతి అధికారి ఫీల్డ్ లోకి వెళ్లి మరీ పనిచేయాలన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: