జూబ్లీహిల్స్ వన్ డ్రైవ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వన్ డ్రైవ్‌లో పనిచేస్తున్న మైనర్ బెనర్జీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాత్‌ రూంలో సెల్‌ఫోన్ చూసి ఒక యువతీ ఫిర్యాదు చేయగా... బాత్‌రూంలో సెల్‌ఫోన్ ద్వారా బెనర్జీ వీడియోల చిత్రీకరిస్తున్నాడు అని విచారణలో గుర్తించారు. రెండ్రోజుల క్రితం కొత్త సెల్‌ఫోన్ కొన్న బెనర్జీ... సెల్‌ఫోన్ తీసుకెళ్లి లేడీస్ బాత్‌రూంలో పెట్టి రికార్డ్ చేస్తున్నాడు అని తెలిసింది. నాలుగున్నర గంటలపాటు బాత్‌ రూం దృశ్యాలను అతను చిత్రీకరించాడు అని తెలిసింది.

వన్ డ్రైవ్‌లో పనిచేస్తున్న హౌస్ కీపర్ బెనర్జీని అదుపులోకి తీసుకున్న పోలీసులు... ప్రస్తుతం స్టేషన్ లో విచారిస్తున్నారు. బెనర్జీతో పాటు వన్ డ్రైవ్ యాజమాన్యంపై కేసు నమోదు చేసారు. ఇక వన్ డ్రైవ్ వ్యవహారంపై పోలీసులను యువతులు ఆశ్రయిస్తున్నారు. వీడియోలు బయటకు రాకుండా చూడాలని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు. వన్‌ డ్రైవ్‌ యజమాని చైతన్యపై కేసు నమోదు చేసారు. దీనిపై చైతన్య మీడియాతో మాట్లాడాడు. 6 నెలల నుంచి పనిచేస్తున్నాడు అని పేర్కొన్నాడు.

ప్రతిరోజు రాత్రి టాయిలెట్స్ క్లీన్ చేస్తుంటాడు అని వివరించారు. ఈ మధ్యనే కొత్త ఫోన్ కొన్నాడు.. అందులో సిమ్ కూడా వేయలేదు అని తెలిపాడు. లేడీస్ టాయిలెట్ లో లైట్ పాడయిపోయింది అని  వర్క్ జరుగుతోంది అని పేర్కొన్నాడు. ఆ ప్లేస్ లో బెనర్జీ ఫోన్ ఉంచాడు అని చైతన్య వివరించాడు. టాయిలెట్ లోకి వెళ్లిన ఒక లేడీ ఫోన్ ఉన్నట్టు గుర్తించి.. మాకు చెప్పింది అని వెంటనే మేము ఫోన్ తీసుకున్నాం అని పోలీసులకు చెప్పాం అని ఆయన పేర్కొన్నారు. బెనర్జీ పాత ఫోన్ కీప్యాడ్ మొబైల్... కెమెరా ఆప్షన్ లేదు అని అందుకే కొత్త ఫోన్ కొన్నాడు అని తెలిపాడు.

ఇక ఇదిలా ఉంటే వన్ డ్రైవ్  లో జరిగిన విషయాన్ని కొందరు క్యాష్ చేసుకుంటున్నారు అని ఆయన పేర్కొన్నారు. వన్ డ్రైవ్ కి వచ్చిన లేడీస్ థర్డ్ పర్సన్స్ ని అప్రోచ్ అవుతున్నారు అని మీ వీడియోస్ కూడా ఉన్నాయి... మీరు 5 లక్షలు, పది లక్షలు ఇస్తే డిలీట్ చేస్తాం అని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అని ఆయన పేర్కొన్నారు. అలాంటి వాళ్ళను నమ్మకండి అని సూచించారు. మావన్ డ్రైవ్ కి వచ్చిన వాళ్ళు ఎవరూ.. కంగారు పడకండి అని స్పష్టం చేసారు. కేశవ్ అనే వ్యక్తి ఇలా మోసం చేస్తున్నట్టు గుర్తించాం అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts