సంక్షేమ పథకాలు ఏవీ మంచివి కావు. అవన్నీ ఆర్థిక తిరోగామి చర్యలే అని ఇప్పటికీ చాలా మంది నెత్తీ నోరూ కొట్టుకుంటున్నా రు. అలాంటప్పుడు జగన్ ఎందుకు అమలు చేస్తున్నారు?

వైఎస్ భక్తుడు ఉండవల్లి అరుణ్ కుమార్ (రాజమండ్రి మాజీ ఎంపీ) తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తిదా యక  విషయాలు చెప్పారు. ఆర్థిక సంబంధ విషయాలపై ఓ స్పష్టమయిన అవగాహన ఉన్న వ్యక్తిగా మంచి విషయాలే వెల్లడించా రు. ఇవి జగన్ అభిమానులు వినాలి. విన్నాక ఆయన చెప్పినవి మంచివో, చెడ్డవో అన్నది కూడా నిర్థారించుకుని తీరాలి. కాస్త చదువుకున్న వాడు కదా!  కనుక ఆయన ఏం చెప్పినా వినాలి. వినే సంస్కృతి రాజకీయ నాయకులకు లేనంత కాలం వారు మంచి నాయకులుగా రాణించలేరు. లేదు కూడా! రాజశేఖర్ రెడ్డికి వినే సంస్కృతి ఉంది. జగన్ కు లేదు. లేదు అంటే లేదు. ఇది


ఎన్నో సందర్భాల్లో నిరూపణ కూడా! ఈ విషయాలు ఎలా ఉన్నా సంక్షేమం పేరిట ప్రభుత్వం చేపట్టిన చర్యలేవీ సమంజసంగా లేనే లేవని చెప్పారు ఉండవల్లి. అయితే కరోనా కారణంగా బిలో పోవర్టీ లెవల్ పీపుల్ కోసం నేను ఈ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టా నని అంటే ఎవ్వరూ కాదనరు అని కూడా చెప్పారు. కరోనా విజృంభణ నేపథ్యంలో ఆర్థిక సంక్షోభం అన్నది తప్పనిసరి అయిందని, దీని నివారణకు పెద్ద పెద్ద ఆర్థిక వేత్తలు చెప్పిన విధంగానే జగన్ నడుచుకుంటున్నాడని, ఆ విధంగా ఆయనకు కరోనా ఎంతో అ డ్వాంటే జ్ అని చెప్పారు. అమర్త్య సేన్ కానీ రాజన్ కానీ ఏం చెప్పారంటే ప్రజలకు వారి వారి కనీస అవసరాలు తీరాలన్నా, కొనుగోలు సా మర్థ్యం పెరగాలన్నా డబ్బులు పంచండి. వారి ఖాతాల్లో ఎంతో కొంత వేయండి. అప్పుడు నగదు వినిమయం పెరుగుతుంది. తద్వా రా మార్కెట్లు నిలబడతాయి అని.. చెప్పారని, అదే ఇప్పుడు జగన్ పాటిస్తున్నాడని అన్నారు ఉండవల్లి.


మరింత సమాచారం తెలుసుకోండి:

ap