తెలంగాణ ఆర్టీసీ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన బస్సులు ఏవీ అంటే అంతా ఠక్కున చెప్పే సమాధానం వజ్రా బస్సులు. తెలంగాణ రాష్ట్ర రోడ్ రవాణ సంస్థ ప్రయాణీకుల సౌకర్యం కోసం మినీ ఏసీ బస్సులను ప్రవేశపెట్టింది. ఇవి ఇప్పుడు టీఎస్ఆర్టీసీకి గుదిబండగా మారాయి. అసలు ఈ బస్సులు ఎందుకు కొన్నారురా బాబు అని సంస్థ కార్మికులే వాపోతున్నారు. గరుడ, గరుడ ప్లస్, రాజధాని పేరుతో ఇప్పటికే ఏసీ బస్సులను టీఎస్ఆర్టీసీ తిప్పుతోంది. అయితే తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ మరింత విస్తృత పరిచేందుకు మెగా ప్లాన్ వేసింది. అందులో భాగంగా వజ్రా పేరుతో ఏసీ బస్సులను ప్రవేశపెట్టింది టీఎస్ఆర్టీసీ. మెయిన్ సిటీలకే పరిమితమైన ఏసీ బస్సులను గ్రామీణ ప్రాంతాల్లో కూడా అందుబాటులోకి తీసుకురావాలనేది ఆర్టీసీ ప్లాన్. చిన్న చిన్న ఊర్ల మధ్య కూడా ఏసీ బస్సులు తిప్పడం వల్ల ఆర్టీసీకి ఆదాయం వస్తుందని అధికారులు భావించారు.

అనుకున్నట్లుగానే స్వరాజ్ మాజ్దా కంపెనీ మినీ వ్యాన్‌లను కొనుగోలు చేసిన ఆర్టీసీ... వాటికి ఏసీ, సీటీంగ్‌లో మార్పులు చేసింది. ప్రతి వ్యాన్‌కు ఓ ఎల్‌సీడీ టీవీ, ఆటోమేటిక్ హైడ్రాలిక్ డోర్, ప్రతి బస్సుకు జీపీఆర్ఎస్ అంటూ హంగులు ఏర్పాటు చేసింది టీఎస్ఆర్టీసీ. 70 లక్షల రూపాయలతో తయారూ చేసిన ఈ బస్సులకు వజ్రా అని పేరు పెట్టి... ఎక్కువగా చిన్న చిన్న డిపోలకే కేటాయించింది. తొలి నాళ్లలో బాగానే నడిచినప్పటికీ... టికెట్ ధర ఎక్కువగా ఉండటంతో వజ్రా బస్సులు ఎక్కేందుకు ప్రయాణీకులు మొగ్గు చూపలేదు. దీంతో ఈ సర్వీసులు నష్టాల బాట పట్టాయి. ఆ  తర్వాత కరోనా రావడంతో... బస్సులన్నీ కూడా డిపోలకే పరిమితం అయ్యాయి. నెమ్మదిగా అన్ని సర్వీసులు ప్రారంభమైనప్పటికీ... వజ్రా బస్సులు తిప్పేందుకు మాత్రం ఆర్టీసీ అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీంతో ఈ బస్సులన్నీ కూడా ఇప్పుడు డిపోల్లోనే ఓ మూలకు చేరుకున్నాయి. సిటింగ్ కెపాసిటీ తక్కువగా ఉండటం వల్ల ఈ బస్సులను చివరికి అద్దెకు కూడా ఎవరూ అడగటం లేదు.  దీంతో ఈ బస్సులను వదిలించుకునేందుకు టీఎస్ఆర్టీసీ అధికారులు ప్లాన్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: