తెలంగాణా అసెంబ్లీ వద్ద మాజీ ఎంపీ జేసి దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. హుజూరాబాద్ గురించి నాకు తెలియదు అని కాని నాగార్జున సాగర్ లో జానారెడ్డి ఎందుకు ఓడిపోయాడు అనేది అందరికీ తెలుసు అన్నారు. అలాగే రాజకీయాలు బాగోలేదు అని, సమాజం కూడా బాగోలేదు అని జేసి దివాకర్ రెడ్డి కామెంట్ చేసారు. జానారెడ్డి గెలవడం కష్టం అని చెప్పిన గెలిచాడా అంటూ ప్రశ్నించారు. జానారెడ్డి నాకు మంచి మిత్రుడు అని జేసి అన్నారు. అయ్యో పాపం ఓడిపోతాడు అని బాధ తోనే అన్నా అని పేర్కొన్నారు.

అలాగే ఆంధ్ర వదిలేసి...తెలంగాణ కు వస్తాను అని కీలక ప్రకటన చేసారు. తెలంగాణ వదిలిపెట్టి నష్టపోయాము అని ఆయన వ్యాఖ్యలు చేసారు. ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో ఓటుకు 4 వేలు అయితది అంటూ జేసి వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. తాడిపత్రి లో పోటీ చెయ్యము అని నేను చెప్పినా... నామినేషన్  ను నా తమ్ముడు నాకు చెప్పకుండా వేయించాడు అని ఆయన పేర్కొన్నారు. నామినేషన్ వేసి విత్ డ్రా చేసుకుంటే మాకు అంతకు మించి అవమానం ఉండదు అని అందుకే పోటీ చేయించా అని తెలిపారు.

ఇక జేసీ దివాకరరెడ్డి పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. సిఎం కేసీఆర్ పై ఆయన ప్రశంశలు కురిపించగా... సీఎల్పీ కార్యాలయానికి వచ్చి టీఆరెస్ పార్టీని పొగడటం బాగోలేదు అని మండిపడ్డారు. మీ వ్యక్తిగత అభిప్రాయాలను బయట పంచుకోవాలని సూచించిన జీవన్ రెడ్డి... సీనియర్ నేతగా జేసీ చెప్పే ప్రతి మాట తెలంగాణ కాంగ్రెస్ కు ఉపయోగపడాలి అన్నారు. ఇంకోసారి రిపీట్ కాదని క్షమాపణ లు చెప్పారు జేసీ. ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశాను అని సీఎం అయ్యాక కలవలేదు కలుద్దాం అని వచ్చాను అన్నారు ఆయన.

సీఎం బాగోగులు అన్ని అడిగి తెలుసుకున్నాను అని జేసి చెప్పుకొచ్చారు. నేను ఇచ్చిన బొకే ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్నారు అని ఆయన పేర్కొన్నారు. రాయల తెలంగాణ ఏర్పడితే అందరం బాగుండే వాళ్ళం అని రాజకీయం అంశం పక్కన పడితే రాయల తెలంగాణను నేను కోరుకున్నాఅని తన మనసులో మాట బయట పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: