దేశంలో ప్రస్తుతం నేరాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా విడుదల చేసిన గణాంకాలు కూడా ఇదే తెలియజేస్తున్నాయి. ప్రతి మూడు గంటలకు ఓ రేప్ కేసు, ప్రతి రెండు గంటలకు ఓ హత్య కేసు దేశంలో నమోదవుతున్నాయి.  వీటి దర్యాప్తు కోసం పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారు. పేరుకే పని గంటలున్నప్పటికీ... సిబ్బంది కొరత కారణంగా అవేవి ప్రస్తుతం అంతగా అమలు కావటం లేదు. సాధారణంగా దేశంలో ప్రతి 100 వంది జనాభాకు ఒక పోలీసు ఉండాలి. కానీ ప్రస్తుతం వెయ్యి మందికి కూడా లేని దుస్థితి. దీంతో పోలీసులపై పని ఒత్తిడి భారీగా పెరిగింది. కొన్ని సందర్భాల్లో డబులు డ్యూటీలు కూడా చేస్తున్నారు. ఇక మహిళా పోలీసుల పరిస్థితి అయితే సరేసరి. కుటుంబాల్ని వదులుకుని... గంటల తరబడి పోలీసు స్టేషన్లల్లో విధులు నిర్వహిస్తూనే ఉన్నారు. ఇక క్రైమ్ స్పాట్, బందోబస్తు, దర్యాప్తు అంటూ విధులు నిర్వహించాల్సిన పరిస్థితి. దీంతో కొన్ని సందర్భాల్లో ఇంటి ముఖం చూసేందుకు కూడా కష్టమవుతోంది.

ప్రస్తుతం పోలీసుల పని గంటలపైనే తీవ్రంగా చర్చ జరుగుతోంది. మహారాష్ట్రలో మహిళా పోలీసుల పని గంటలపై పెద్ద దుమారమే రేగుతోంది. వాస్తవానికి మహారాష్ట్రలో ఉమెన్ పోలీసు వర్కింగ్ అవర్స్ 12 గంటలుగా అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రస్తుతం అది 16 నుంచి 18 గంటలకు కూడా చేరుకుంది. దీనిపై మహిళా పోలీసులు ఆందోళన కూడా చేపట్టారు. తమపై పని ఒత్తిడి పెరుగుతోందని ఏకంగా రాష్ట్ర డీజీపీకి విజ్ఞప్తి లేఖ అందించారు. ఈ విషయంపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టిన డీజీపీ... సమగ్ర నివేదికతో మహారాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించారు. మహిళా పోలీసులు పడుతున్న కష్టంపై దృష్టి పెట్టాలని లేఖలో ప్రస్తావించారు. డీజీపీ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని సంకీర్ణ సర్కార్... మహిళా పోలీసుల పని గంటలు తగ్గించేందుకు అంగీకరించింది. మహారాష్ట్ర వ్యాప్తంగా మహిళా పోలీసుల పని గంటలు ఇకపై 12 గంటల నుంచి 8 గంటలకు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని డీజీపీ సంజయ్ పాండే ప్రకటించారు. ముందుగా కొన్ని స్టేషన్లలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తామని... ఆ తర్వాత రాష్ట్ర మంతా ఇదే విధానం అమలు చేస్తామన్నారు డీజీపీ. ప్రస్తుతం పూణె, నాగపూర్, అమరావతి జోన్ పరిధిలో మహిళా పోలీసులకు 8 గంటల షిఫ్ట్ సిస్టమ్ అమలు చేస్తామన్నారు డీజీపీ. అలాగే త్వరలోనే మహిళాల పోలీసుల నియామకం కూడా చేపట్టనున్నట్లు డీజీపీ తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: