ఎపి టీడీపీలో పరిణామాలు తెలుగు తమ్ముళ్లను ఆందోళనకు గురిచేస్తున్నాయట.టీడీపీపై బహిరంగంగా విమర్శలు చేసే వారి విషయంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇచ్చిన ప్రకటన ఇప్పుడు టీడీపిలో పెద్ద చర్చకు కారణం అవుతున్న వేల టీడీపీ నేతల మధ్య నెలకొన్న విభేదాల విషయంలో రచ్చకెక్కే వారిపై కఠిన చర్యలు ఉంటాయని అచ్చెన్నాయుడు రిలీజ్ చేసిన ప్రకటనపై ఇప్పుడు సొంత పార్టీ నేతలే సెటైర్లు వేస్తున్నారు.అస్సలు అధ్యక్షుడు అచ్చెన్నపై తమ్ముళ్ల విసుర్ల వెనుక ఉన్న కారణమేంటి.అధినేతపై ఉన్న కోపం అంతా అధ్యక్షుడుపై తీర్చు కుంటున్నారా.ఒక్క లేఖ విషయంలో తమ్ముళ్ల రచ్చ వెనుక ఉద్దేశమేంటి.

ఏపీ టీడీపీలో ఎన్ని మార్పులు చేసినా ఎవరు అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన పార్టీలో పరిస్థితులు ఇప్పట్లో మారేలా కనిపించడం లేదట.సొంత పార్టీ నేతల మధ్య విబేధాల కారణంగా ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నామని  తెలుగు తమ్ముళ్లు ఆందోళన చెందడంతో పాటు  2019సార్వత్రిక ఎన్నికల తరువాత ఏపీ టీడీపీ పరిస్థితి రోజు రోజుకి దిగజారడం పార్టి పరిస్థితిపై ఆందోళన  కలిగిస్తోందని అధినేత వద్ద వాపోతున్నారట.ఇప్పటికే 13జిల్లాల్లో పార్టీ నేతల మధ్య  నెలకొన్న వివాదాల కారణంగా ఇప్పటికి పార్టీ పరిస్థితి మరింత దారుణంగా మారిందని ఇలాగే వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో  టీడీపీ పరిస్థితి ఏంటని తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారట.ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోర ఓటమి మూటగట్టుకున్నామని ప్రభుత్వ వైఫల్యాలను పార్టికి అనుకులంగా మార్చుకోవడంలో విఫల మయ్యామని నేతలు మొత్తం గగ్గోలు పెడుతున్నారని టీడీపీ కార్యాలయం వేదికగా టీడీపీ నేతల మధ్య జోరుగా చర్చ నడుస్తోంది. ఇప్పటికే పార్టిలో నెలకొన్న అనేక వివాదాలను పరిష్కరించకుండా నాన్చుడు ధోరణితో ఉండటంతో టీడీపీ నేతలు మొత్తం ఉండటం బహిరంగంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం వల్ల రాబోయే రోజుల్లో  టీడీపీ పరిస్థితి ఎంటన్నది  తెలుగు తమ్ముళ్ల ప్రశ్నలు వేస్తున్నారు.మరోవైపు టీడీపీలో వరుసగా జరుగుతున్న పరిణామాల విషయంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చూసి చూడనట్లు వ్యవహరించడం పార్టీలో మరింత నష్టానికి  కారణం అవుతుందని అంటున్నారు తెలుగు తమ్ముళ్లు.ఈ మధ్య కాలంలో నియోజకవర్గ ఇంచార్జ్, సమన్వయ కర్తలు,పార్లమెంట్ అధ్యక్షుల నియామకంలో అంటి ముట్టనట్లు ఉండటంతో ఆయా నియోజకవర్గ  పరిధిలోపార్టీ బలోపేతంపై దృష్టి పెట్టకుండా నేతల మధ్య విభేదాలకు చెక్ పెట్టకుండా కమిటిల నియామకాలు చేపట్టడం వల్ల అనేక ఇబ్బందులు వస్తున్నాయని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారూ.ఈ మధ్య కాలంలో 13జిల్లాల పరిధిలో కొత్త కమిటీల నియామకం వల్ల నియోజకవర్గ పరిధిలో పెద్ద సమస్యలు ఉత్పన్నం అవుతు న్నాయని వీటి  విషయంలో  అధ్యక్షుడుగా అచ్చెన్నాయుడు చూసి  చూడనట్లు వ్యవహరించి విభేదాలతో భహిరంగంగా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకుంటామని  చెప్పడం ఏంటని తమ్ముళ్ల మధ్య జోరుగా చర్చ నడుస్తోంది.ఇప్పటికే అనేక మార్లు  అధినేత వద్దకు యువనేత వద్దకు ఈ అంశాలను తీసుకొని వెళ్లిన ఎటువంటి మార్పులేదని అధ్యక్షుడుగా అచ్చెన్నాయుడు జోక్యం చేసుకొని పరిష్కారం చూపాలని వేడుకుంటున్నారు.నియోజకవర్గ పరిధిలో సమస్య పెద్దది కాకుండా ముందుగా అధ్యక్షుడుగా జోక్యం చేసుకొని టీడీపీ నేతలను సమన్వయం చేసుకుంటే ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కావని పార్టీ బలోపేతం అవుతుందని వారంటున్నారు.

ఇదిలా ఉంటె అధ్యక్షుడుగా అందరి విషయంలో ఆంక్షలు పెడుతున్న అచ్చెన్నాయుడు తాను పార్టీపై,యువనేతపై చేసిన కామెంట్స్ మర్చిపోయారా అని తెలుగు తమ్ముళ్లు సెటైర్లు వేస్తున్నారట.అధ్యక్షుడు అయ్యాక నియోజకవర్గాల పరిదిలో పర్యటనలు చేయకుండా కమిటీలను యాక్టివ్ రోల్ పోషించేలా చర్యలు చేపట్టకుండా పార్టీలోని నేతల మధ్య విభేదాలు కారణంగా విమర్శలు చేసిన వారిపై  ఇప్పుడు కొత్తగా ప్రకటనలు ఇవ్వడం ఏంటని తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు.ఇటువంటి అంశాల్లో  విభేదాలు  వచ్చినప్పుడు  అధ్యక్షుడుగా హుందాగా ఉండాల్సిన అచ్చెన్నాయుడు  సీరియస్గా ప్రకటన ఎలా ఇస్తారని తమ్ముళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అధ్యక్షుడు హోదాలో ముందు నుంచి పార్టిలో కీ రోల్ పోషిస్తే ఎటువంటి చర్యలు ఉండవని ఇప్పటికైనా క్యాడర్ దగ్గర చేసుకోవడం కోసం అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దృష్టి సారించాలని విభేదాలు వివాదాలు ఉన్న చోట పరిష్కారం దిశగా అడుగులు వేస్తే అటువంటి పునరావృతం కావని అచ్చెన్నాయుడుకు సూచిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు.ఏది ఏమైనా టీడీపీలో ఎన్ని మార్పులు చేపట్టిన పార్టీ నేతల తీరు మాత్రం మారడం లేదు అధ్యక్షుడుగా  అచ్చెన్నాయుడు  చర్యలకు సీద్దమైన  తెలుగు తమ్ముళ్లు మాత్రం అధ్యక్షుడు తీరుపై మండిపడుతున్నారు చూడాలి మరి రాబోయే రోజుల్లో టీడీపీలో మార్పుల విషయంలో వస్తున్న కామెంట్స్ పై అచ్చెన్నాయుడు ఎలా ముందుకు వెళ్తారో.

మరింత సమాచారం తెలుసుకోండి: