కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని, అందుకు కార్యాచరణను సిద్ధం చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ప్రజా సమస్యలపై ఉద్యమించేందుకు టిఆర్ఎస్, బిజెపియేతర పార్టీలతో కలిసి ఉద్యమించాలని నిర్ణయించారు. ఇప్పటికే తీసుకున్న వరుస కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు ప్రతి నాయకుడు ప్రజల్లోకి వెళ్లాలని, దీంతోపాటు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా నిర్ణయాలు ఉండాలనే అభిప్రాయానికి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ మొదటి సమావేశం శనివారం గాంధీ భవన్లో జరిగింది. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్, పీఏ సీ  చైర్మన్ మాణిక్యం ఠాగూర్ అధ్యక్షతన వహించగా.. పిసిసి అధ్యక్షుడు, సీఎల్పీ నేత బట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు, కమిటీ సభ్యులు, వివిధ కమిటీల చైర్మన్లు హాజరయ్యారు.

ఈ సమావేశంలో నిరుద్యోగ సమస్యలపై అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 9 వరకు చేపట్టబోయే ఆందోళన కార్యక్రమాలు, సభలు,  సమావేశాలు, అఖిలపక్ష సమావేశంలో సోమవారం చేపట్టే భారత్ బంద్. 30న జిల్లా కలెక్టర్లకు ఇచ్చే వినతి పత్రాలతో పాటు అక్టోబర్ 5న పోడు భూముల అంశంపై 400 కిలోమీటర్ల మేరకు చేపట్టే ఫోడ్ రాస్తారోకో అంశంపై చర్చించారు. పార్టీ కార్యక్రమాలన్నింటినీ విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ ప్రత్యేక దృష్టి సారించాలని పార్టీ నాయకులకు టాగూర్ సూచించారు. జిల్లాలకు సీనియర్లు అందరూ వెళితే కేడర్లో ఉత్సాహం వస్తుంది అన్నారు.

అసెంబ్లీలో కూడా విద్య,  వైద్యం, సంక్షేమ పథకాల అమలతో పాటు టిఆర్ఎస్ ఇచ్చిన హామీల పై నిలదీయాలని ఠాగూర్ సూచించారు. మహిళా సమస్యలపై ఉద్యమించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. పావలా వడ్డీ, వడ్డీ లేని రుణాలు, అభయ హస్తం పథకాన్ని ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. పంజాగుట్టలోని అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుపై పార్టీ పోరాటం చేయాలని విహెచ్ అన్నారు. దళిత,  గిరిజన దండోరా సభల మాదిరిగానే బీసీ గర్జన లను కూడా జిల్లాల వారీగా నిర్వహించాలని అభిప్రాయానికి వచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: