మొదటిసారి చాక లి ఐలమ్మ 126 జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడం  గర్వ కారణంగా ఉందని తెలిపారు తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి మంత్రి హరీష్ రావు.  సిద్ధిపేట పట్టణంలోని హౌసింగ్ బోర్డు చౌరస్తా లో చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిం చారు మంత్రి హరీష్ రావు, జెడ్పీ చైర్మన్ రోజా శర్మ, కలెక్టర్ వెంకట్ రాంరెడ్డి. ఈ సందర్భంగా తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి మంత్రి హరీష్ రావు  మాట్లాడుతూ....  భారత దేశం లోనే మొదటసారిగా ఐలమ్మ జయంతి, వర్ధంతి లను అధికారికంగా నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు.

తెలంగాణ సీఎం కెసిఆర్ పోరా ట యోధుల గుర్తించి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారని వెల్లడించారు తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి మంత్రి హరీష్ రావు. చాకలి ఐలమ్మ అంటేనే పోరాటానికి స్ఫూర్తి, మహిళల హక్కుల కోసం ఎంత గానో కృషి చేసిందని స్పష్టం చేశారు మంత్రి హరీష్‌ రావు.  రాబోయే రోజుల్లో సిద్దిపేట లో నిలు వెత్తు ఐలమ్మ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు మంత్రి హరీష్‌ రావు.  రజకుల ,నాయిబ్రహ్మనుల కోసం సీఎం కెసిఆర్ 250 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాడని గుర్తు చేశారు.  

తెలంగాణ రాష్ట్రం లో నే సిద్దిపేట పట్టణం లో మాడ్రాన్ దోభి ఘాట్ నిర్మించామన్నారు తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి మంత్రి హరీష్ రావు.  అలాగే.... రజకుల పని ముట్ల కోసం ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా పెద్ద ఎత్తున నిధులు సమకురుస్తామని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఇప్పటి జరిగింది ఒక టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కారణంగానేనని స్పష్టం చేశారు తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి మంత్రి హరీష్ రావు.  ఇక ముందు కూడా ఈ అభివృద్ధి కొనసాగుతుందని కుండ బద్దలు కొట్లారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: