ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రి వర్గ విస్తరణకు సిద్దమైన‌ట్టే క‌నిపిస్తోంది. ద‌స‌రాకే కాస్త అటూ ఇటూగా మంత్రి వ‌ర్గంలో భారీ మార్పులు, చేర్పులు ఉంటాయ‌ని చెపుతున్నారు. మ‌రి కొంద‌రు మాత్రం మరో మూడు నెలల పాటు దీనిని జగన్ వాయిదా వేశార‌ని..వ‌చ్చే సంక్రాంతి పండగ సమయంలో నూతన మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేయబోతున్నట్లు చ‌ర్చించు కుంటున్నారు. అయితే జ‌గ‌న్ తొలి సారి ముఖ్య‌మంత్రి అయిన వెంట‌నే త‌న కేబినెట్లో 90 శాతం మంది మంత్రుల‌ను మార్చేస్తాన‌ని.. రెండున్న‌రేళ్ల త‌ర్వాత ఇప్పుడు ఉన్న మంత్రుల‌లో కొత్త మంత్రులు వ‌స్తార‌ని ఓపెన్‌గానే చెప్పారు. జ‌గ‌న్ ముందు నుంచి చెపుతున్న‌ట్టుగానే 90 శాతం మంది మంత్రులు అవుట్ అని అంటున్నారు. అయితే ఇప్పుడు ఏయే జిల్లాల నుంచి ఏయే మంత్రులు కేబినెట్లో ఉంటారు ? ఎవ‌రు బ‌య‌ట‌కు వెళ‌తారు ? ఎవ‌రు కొత్త‌గా కేబినెట్లోకి వ‌స్తారు ? అనే దానిపై ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.

ఇక కొంద‌రు మంత్రులు మాత్రం త‌మ ప‌ద‌వుల‌ను నిలుపు కుంటార‌నే అంటున్నారు. ఈ లిస్టులో కృష్ణా జిల్లా నుంచి ఇద్ద‌రు మంత్రుల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ జిల్లా నుంచి మొత్తం కేబినెట్లో ముగ్గురు మంత్రులు ఉన్నారు. వీరిలో వెల్లంప‌ల్లి శ్రీనివాస‌రావు - కొడాలి నాని తో పాటు పేర్ని నాని కూడా మంత్రులుగా ఉన్నారు. ఇప్పుడు మార్పులు, చేర్పుల‌లో ఇద్ద‌రు నానిలు సేఫ్ అని వైసీపీ వాళ్లే చెపుతున్నారు. బ‌య‌ట ప్ర‌చారం మాత్రం ఈ సారి వంద శాతం మంది మంత్రుల‌ను మార్చేస్తామ‌ని చెపుతున్నా అది సాధ్యం కాద‌నే అంటున్నారు. జ‌గ‌న్‌కు ఇద్ద‌రు నానిలు న‌మ్మిన బంట్లుగా ఉన్నారు. అందుకే వారిని జ‌గ‌న్ త‌ప్పించ‌ర‌నే అంటున్నారు.

కొడాలి నాని విష‌యానికి వ‌స్తే ఆ య‌న సామాజిక వ‌ర్గం అయిన క‌మ్మ‌ల నుంచి వైసీపీలో ఆయ‌నే బ‌ల‌మైన నేత‌. జ‌గ‌న్‌పై ఎవ‌రైనా విమ‌ర్శ‌లు చేస్తే వెంట‌నే రియాక్ట్ అవుతారు. అందుకే ఆయ‌న ప‌ద‌వి సేఫ్‌. ఇక పేర్ని నాని కూడా కాపు సామాజిక వ‌ర్గంలో బ‌ల‌మైన నేత‌గా ఉన్నారు. జ‌గ‌న్ పై వ‌చ్చే విమ‌ర్శ‌ల‌ను సమర్థవంతంగా తిప్పికొట్టాలంటే పేర్ని నాని వంటి వారిని కంటిన్యూ చేయక తప్పదని ఆ పార్టీ కీల‌క నేత‌లు భావిస్తున్నార‌ట‌. అందుకే వీరిద్ద‌రి ప‌ద‌వుల‌కు వ‌చ్చిన ఢోకా ఏం లేద‌ని అంటున్నారు. మ‌రి వీరి ల‌క్ ఎలా ?  ఉంటుందో ?  చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: