నాయ‌కుల‌కు దూకుడు ఉండాల్సిందే. అయితే.. అది ఎంత వ‌ర‌కు ఉండాలో.. అంత వ‌ర‌కు మాత్ర‌మే ఉండాలి. హ‌ద్దులు మీరిన దూకుడు ఎప్పుడూ.. ప్ర‌మాద‌మే. అది వ్య‌క్తులైనా.. నాయ‌కుల‌కైనా..!  రాజ‌కీయాల్లోనూ.. దూకుడు ఉండాలి. కానీ, అది కొంత వ‌ర‌కు మాత్ర‌మే ప‌రిమితం కావాలి. అది మితిమీరితే.. విక‌టించే ప్ర‌మాదం.. అనుకున్న‌ది ద‌క్క‌ని ప‌రిస్థితి కూడా ఏర్ప‌డే ఛాన్స్ క‌నిపిస్తుంది. ఇప్పుడు వైసీపీలో ఇద్ద‌రు నేత‌ల విష‌యంలో ఇదే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే.. త్వ‌ర‌లోనే ఏపీ మంత్రివ‌ర్గాన్ని విస్త‌రించేందుకు సీఎం జ‌గ‌న్ ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకున్నారు. ఇప్ప‌టికేదీనికి సంబంధించిన క్ర‌తువును ఆయ‌న స్టార్ట్ చేశార‌ని వార్తలు వ‌స్తున్నాయి. వ‌చ్చే డిసెంబ‌రులో లేదా.. జ‌న‌వ‌రిలో మంత్రి వ‌ర్గాన్ని పూర్తిగా మారుస్తార‌ని వార్త‌లు వ‌చ్చాయి.

దీంతో ఎవ‌రికి వారు త‌మ‌కు ప‌దవి ఇస్తారంటే.. త‌మ‌కు గ్యారెంటీ అని అనుకుంటున్నారు. ఈ వ‌రుస‌లో రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కురాలు.. చిత్తూరు జిల్లాన‌గిరి ఎమ్మెల్యే రోజా అనుచ‌రులు కూడా త‌మ నాయ‌కురాలికి ఖ‌చ్చితంగా ప‌ద‌వి ద‌క్కు తుంద‌ని ప్ర‌చారం చేసుకుంటున్నారు. గ‌త మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లోనే రోజాకు ప‌ద‌వి దక్కుతుంద‌నే  ప్ర‌చారం జ‌రిగింది. అంతేకాదు.. ఏకంగా హోంశాఖ‌నే ఆమెకు అప్ప‌గిస్తార‌ని అనుకున్నారు., అయితే.. ఆమెకు ద‌క్క‌లేదు. ఇక‌, ఇప్పుడు గ్యారెంటీ అని మ‌రోసారి రోజా అనుచ‌రులు సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తున్నారు. అయితే.. ద‌క్కే అవ‌కాశం లేద‌ని సీనియ‌ర్లు చెబుతున్నారు.

దీనికి కార‌ణం.. దూకుడేన‌ని అంటున్నారు. సొంత పార్టీలోనే నేత‌ల‌ను దూరం చేసుకోవ‌డం.. మంత్రుల‌తోనే విభేదాలు పెట్టుకోవ‌డం వంటివి ఆమెకు మైన‌స్ మార్కులు ప‌డుతున్నాయ‌ని అంటున్నారు. ఇక‌, మ‌రో నాయ‌కుడు కృష్ణాజిల్లాకు చెందిన బీసీ సామాజిక వ‌ర్గం నేత జోగి ర‌మేష్ కు ఉన్న మార్కులు కూడా తగ్గిపోయాయ‌ని అంటున్నారు. పెడన నుంచి గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న ర‌మేష్‌.. ఆది నుంచి కూడా ఫైర్ బ్రాండ్‌గానే ముందుకు సాగారు. అంతేకాదు.. స్థానిక ఎన్నిక‌ల్లోనూ పార్టీని ప‌రుగులు పెట్టించారు. ఈ విష‌యంలో సందేహం లేదు. అయితే.. ఇటీవ‌ల చంద్ర‌బాబు ఇంటిపై దాడికి ప్ర‌య‌త్నించార‌నే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.

ఇదే పెద్ద మైన‌స్‌గా మారిపోయింద‌ని అంటున్నారు.ఈ  విష‌యంలో పార్టీ అధిష్టానం అనుమ‌తి తీసుకోకుండానే ఆయ‌న చ‌ర్య‌ల‌కు దిగార‌ని.. వెళ్తున్న క్ర‌మంలోనూ పార్టీకి స‌మాచారం అందించ‌లేద‌ని.. ఇదే విష‌యంపై సీఎం జ‌గ‌న్ కూడా సీరియ‌స్ అయ్యార‌ని కొన్ని క‌థ‌నాలు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో ఇప్పుడు ఆయ‌న‌కు ప‌దవి ఇవ్వ‌డం ద్వారా పార్టీపై వ్య‌తిరేక‌త పెరిగే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు.ఈ క్ర‌మంలో వేరే నామినేటెడ్ ప‌ద‌వి ఇచ్చే ఛాన్స్ ఉందే త‌ప్ప‌.. మంత్రి వ‌ర్గంలోకి తీసుకునే అవ‌కాశం లేద‌ని చెబుతున్నారు. మరి వీరి దూకుడే వీరికి ప‌ద‌వులు దూరం చేస్తోందా?  చూడాలి ఏం జరుగుతుందో!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: