ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కొత్త జిల్లాల కు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి. ఇప్పుడు రాబోయే సాధారణ బడ్జెట్ సమావేశాల లోపే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో కొత్త రాష్ట్రాల ఏర్పాటు ప్ర క్రియ పూర్తి అవుతుందని స్పష్టం చేశారు స్పీకర్ కొన రఘుపతి. జనాభా గణన ప్రస్తుతం జరుగుతున్న నేపథ్యంలో... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు కాస్త ఆలస్యం జరిగిం దని... త్వర లోనే ఈ ప్రక్రియ పూర్తి అవుతుం దని స్పష్టం చేశారు. 

బ్రాహ్మణ కార్పొ రేషన్ ను బీసీ కార్పొరేషన్ లోన్ లో విలీనం చేయడంపై... ఏ ఒక్కరూ ఆందోళన చెందా ల్సిన అవసరం లేదని పేర్కొ న్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూ టీ స్పీకర్ కోన రఘుపతి.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల నిర్వహణ మాత్రమే బిసి కార్పొరేషన్ పర్యవేక్షణ చేస్తోందని చెప్పుకొచ్చారు. ఇక పాలనా పరమైన సౌలభ్యం కోసం మాత్రమే ఈ ప్రక్రియ కొనసాగుతోందని స్పష్టం చేశారు ఏపి డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి.

బ్రాహ్మణ కార్పొ రేషన్ ను బీసీ కార్పోరేషన్ లో విలీనం చేయడం కారణంగా రిజర్వేషన్ల లో ఇలాంటి  మార్పులు ఉండవని కుండ బద్దలు కొట్టారు ఆయన. అలాగే దేవాదాయ శాఖ నిధులు బ్రాహ్మణ కార్పొ రేషన్ వదల ఇస్తున్నారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి అని గుర్తు చేశారు.  ఈ విలీనం కారణంగా  ఎలాంటి నష్టం ఉండ బోదని అని కుండ బద్దలు కొట్టారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి. ఏ ఉద్దేశం తో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు... ఆ లక్ష్యానికి అనుగుణం గా నే పని చేస్తుందని స్పష్టం చేశారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారు ఎవరూ కూడా ఆందోళన చెందనవసరం లేదని చెప్పారు.



మరింత సమాచారం తెలుసుకోండి: