గుడివాడ గడ్డపై టీడీపీ, వైసీపీ.పొలిటికల్ వార్ సిద్ధమ వుతుందా.బెజవాడ నుంచి గుడివాడ వైపు రాధా ప్రయాణాల  వెనుక ఉన్న వాస్తవం ఏంటి.గుడివాడ వేదికగా పొలిటికల్ ఈక్వేషన్ మారుతోందా. విజయవాడలో తన పొలిటికల్ ఫెయిల్యూర్  జర్నీకి వంగవీటి రాధా గుడివాడ వేదికగా చెక్ పెట్టబోతున్నారా.కొడాలి నాని కంచుకోటలో వంగవీటి రాదా పర్యటన వెనుక కారణాలేంటి.రాధ పర్యటనపై కన్ఫ్యూజన్ నెలకొన్న వేల కొడాలి నానితో   వంగవీటి రాధ అనూహ్య భేటీ వెనుక  ఉన్న కారణాలేంటి.గుడివాడ గడ్డపై రాదా నానిల భేటీపై ప్రజలు ఏమంటున్నారు రాధా వైసీపీలోకి వస్తారా నానీపై తొడ కొడతారా.


వంగవీటి రాధ గుడివాడ పర్యటన ఆసాంతం ఆసక్తికరంగా మారింది. తన చిరకాల మిత్రుడు కొడాలి నాని కంచుకోట లాంటి గుడివాడలో రాధ పర్యటనపై రాజకీయ వర్గాల్లో  విస్తృతంగా  చర్చ నడుస్తోంది.ఒకవైపు రాధ టీడీపీ నుంచి పోటీ చేస్తారని అందులో భాగంగానే రాధ గుడివాడలో వరుస పర్యటనలు చేస్తున్నారని వార్తలు షికార్లు చేస్తున్నాయి.అందుకు బలం చేకూరేలా గుడివాడలో నాని  వ్యతిరేక వర్గీయులు మొత్తం పార్టీలకు అతీతంగా ఇదే అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెల్లే ప్రయత్నం ముమ్మరం చేస్తున్నారు.అస్సలు నాని గడ్డపై రాధ పర్యటన ఎలా ఉన్నా, ఎందుకు వచ్చారని ఎవరికి సమాచారం లేకున్నా రాధ గుడివాడలో పలువురుతో ప్రత్యేకంగా భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.ఇప్పటికే రాధ పర్యటనపై అటు టీడీపీలోను ఫుల్ జోష్ కొనసాగుతోంది.ఎన్నికల ముందు రాధ వైసీపీని వీడి టీడీపీలోకి వెళ్లడం ఆపార్టీ స్టేట్ స్టార్ క్యాంపైనర్ గా నియమించడంతో సుడిగాలి పర్యటన చేస్తూ  పొలిటికల్ గా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.ఇదిలా ఉంటె రాధ గుడివాడలో వరుస పర్యటనలపై అటు టీడీపీలోని,వైసీపీలోని ఒక వర్గం నేతలకు క్లారిటీ రావడం లేదట.రాధ కేవలం పొలిటికల్ జర్ని చేస్తే వేరే మార్గంలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తారని కానీ ఇక్కడ నార్మల్ గా వచ్చి వెళ్తున్నారని ఇరుపార్టీల నేతలు అంటున్నారు.అయితే రాధ మాత్రం గుడివాడ నుంచి బరిలోకి దిగేందుకు గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్నారని కొందరు అంటుంటే మరికొందరు మాత్రం  రాధ గుడివాడ పర్యటనకు రాగానే   టీడీపీ నేతలు మొత్తం వరుసబెట్టి ఇక్కడ నుంచి పోటీ చేయాలని నానిని డీ కొట్టాలంటే  మీరే సరైన వాళ్లంటు ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారట.రాధ ఉద్దేశం ఏదైనా గుడివాడలో పర్యటన పొలిటీకల్ కాకపోయినా వైసీపీ,టీడీపీల లెక్కలు మాత్రం పోలిటికల్ గా హాట్  టాపిక్ గా మారాయి.వంగవీటి రాధ గుడివాడ పర్యటన వస్తున్న పుకార్లు జరుగుతున్న చర్చ ఒకవైపు ఇలా ఉంటే,ఇప్పుడు వంగవీటి రాధ గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇరువురు భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.రాదా టీడీపీ తరపున బరిలోకి దిగుతారని తెలుగు తమ్ముళ్లు అంటుంటే వైసీపీ నేతలు మాత్రం వాటిని కొట్టి పడేస్తున్నారు.తాజాగా జరిగిన బెటితో రాధ వైసీపీకి వచ్చేందుకు నాని కసరత్తు సిద్ధం చేసారని  వైసీపీకి తిరిగి రావాలని నాని ప్రపోజల్ పెట్టడం అందుకు రాధ ఒకే చెప్పారని వార్తలు వండి వారుస్తూన్నాయి కొన్ని ప్రభుత్వ అనుకూల మీడియా సంస్థలు.వంగవీటి రాధ, కొడాలి నానిలు గుడివాడలో జరిగిన భేటీపై జరుగుతున్న ప్రచారం  ఏదైనా  అస్సలు వాస్తవం వేరే ఉందని అంటున్నారు.రాధ ,నానిల  సన్నిహితులు.  ఒక ప్రయివేటు కార్యక్రమం గుడివాడలో జరుగుతుండటం,అదే కార్యక్రమంలో కొడాలి నాని, వంగవీటి రాధకు ఆహ్వానాలు అందటంతో కొంచె ముందుగానే  చేరుకున్నారు కొడాలి నాని.అయితే  అదే కార్యక్రమంలో వంగవీటి రాధ వస్తున్నారని తెలుసున్న కొడాలి నాని  వంగవీటి రాద కోసం గంటపాటు వేచి  చూశారని అక్కడ ఉన్న రాధ సన్నిహిత వర్గాలు అంటున్నాయి.కార్యక్రమంలో మంత్రిగా హాజరైన నాని వెంటనే వెళ్లకుండా రాధా కోసం వేచి చూడాల్సిన అవసరం ఏముందని ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది?.రాధ కోసం వేచి చూడటం రాగానే ఇద్దరు కలిసి ఒక గదిలో అందరూ కలిసి చర్చించు కోవడం కలిసి ఒక వేదికపైకి రావడంతో వారం రోజులుగా గుడివాడపై నడుస్తున్న రాజకీయ చర్చకు ఫుల్ స్టాప్ పెట్టినట్లు అయ్యిందని భావిస్తున్నారట కోడలి నాని అందులో భాగంగానే రాధతో కోడలి నాని భేటీ అయ్యారని రాధా వర్గీయులు అంటున్నారు.

 
అయితే మొత్తం గుడివాడ పొలిటికల్ చర్చలో తనపై,తన నియోజకవర్గం పరిధిలో రాధ పోటీ చేస్తారని  వస్తున్న  అన్నిటికీ చెక్ పెట్టేలా నాని వ్యూహాత్మకంగా అడుగులు వేయడం మాత్రం కొత్త చర్చకు దారి తీస్తుంది.రాధ చేస్తున్న  పర్యటనలు ఏవైనా , ప్రయత్నాలు  దేనికైనా కొడాలి నాని మాత్రం కావాలని రాధాతో భేటీ అయ్యి అన్ని విమర్శలకు, వార్తలకు బ్రేక్ వేశారని కానీ రాధ పర్యటనపై కొడాలి నాని పునరాలోచనలో పడ్డారని రాజకీయంగా చర్చ నడుస్తోంది.చూడాలి మరి రాబోయే రోజుల్లో రాధ నానిల భేటీ తరువాత గుడివాడలో ఏమి జరగబోతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: