ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపై 2012లో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడంతో మొదలైన తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైరం.... దాదాపు పదేళ్లుగా కొనసాగుతూనే ఉంది. కిరణ్ సర్కార్‌పై వైసీపీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని తెలుగుదేశం పార్టీ వ్యతిరేకించింది. దీంతో టీడీపీ సపోర్టుతో కిరణ్ సర్కార్ గట్టెక్కింది.  పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై అప్పట్లో విమర్శలు కూడా వెల్లువెత్తాయి. బాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ... కొడాలి నాని వంటి సీనియర్ నేతలు కూడా తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారు. నాటి నుంచి నేటి వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ, వైసీపీ మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో వైసీపీని ఓడించేందుకు బీజేపీ, జనసేనతో జత కట్టారు చంద్రబాబు. అనుకున్నది సాధించారు కూడా.

2019 సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సారధ్యంలో ఎన్నికలకు వెళ్లిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... ఎవరూ ఊహించని రీతిలో బంపర్ మెజారిటీతో విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీని కొలుకోలేని దెబ్బ కొట్టిన వైసీపీ అధ్యక్షుడు.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... ఏపీలో టీడీపీ అనేది లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నారు. గత ప్రభుత్వ తప్పిదాలను వరుసగా ఎత్తిచూపుతూ.. టీడీపీ నేతలను ఇరుకున పెడుతున్నారు కూడా. ఇప్పటికే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై  కేసులో జైలుకు పంపారు. జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ మెడకు కూడా ఏపీ ఫైబర్ స్కామ్ చుట్టుకునేలా ఉంది. రెండేళ్ల పాటు టీడీపీని ఆడుకున్న వైసీపీ నేతలు... ఇప్పుడు తెలుగు తమ్ముళ్లను పక్కన పెట్టేశారు. ప్రస్తుతం వైసీపీ నేతల టార్గెట్ అంతా కూడా.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పైనే ఉంచారు.


మరింత సమాచారం తెలుసుకోండి: