గుడివాడ నియోజ‌క‌వ‌ర్గం ఎప్పుడూ హాట్ హాట్ రాజ‌కీయాల‌కు పెట్టింది పేరు అన్న‌ది తెలిసిందే. అక్క‌డ వైసీపీ నుంచి మంత్రిగా ఉన్న కొడాలి నాని టీడీపీకి ఎప్పుడూ కొర‌క‌రాని కొయ్య‌గానే ఉంటున్నారు. అయితే మూడు రోజులుగా ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. మాజీ ఎమ్మెల్యే, దివంగ‌త కాపు నేత వంగ‌వీటి మోహ‌న రంగ త‌న‌యుడు అయిన వంగ‌వీటి రాధా గుడివాడ నుంచి టీడీపీ అభ్య‌ర్థిగా బ‌రిలో ఉంటార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఇంత‌లోనే గుడివాడ‌లో జ‌రిగిన ఓ ప్రైవేట్ ఫంక్ష‌న్లో మంత్రి నాని, రాధా ఇద్ద‌రూ మాట్లాడు కోవ‌డంతో ఆయ‌న వైసీపీలో చేరుతున్నార‌న్న ప్ర‌చారం జ‌రిగింది.

అయితే ఈ ప్ర‌చారంపై క్లారిటీ వ‌చ్చేసింది. రాధా తో పాటు ఆయ‌న అనుచ‌రులు స్పందించారు. వైసిపిలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై వంగవీటి రాధా తీవ్ర ఆగ్రహాం వ్య‌క్తం చేశారు. ఇదంతా కేవ‌లం దుష్ప్ర‌చార‌మే అని చెప్పారు. శుభకార్యాలను సైతం రాజకీయాలకు వాడుకునే నీచ సంస్కృతి గుడివాడకు పాకిందని మండిప‌డ్డ రాధా శుభకార్యాలలో శత్రువు ఎదురుపడినా పలకరించడం భారతీయ సంప్రదాయం అన్న విష‌యం ఆయ‌న గుర్తు చేశారు.

ఇక గుడివాలో రాధా కేంద్రంగా జ‌రుగుతోన్న ప‌రిణామాలు చూస్తుంటే 2024 ఎన్నిక‌ల‌లో టీడీపీ నుంచి గుడివాడ‌లో ఆయ‌నే పోటీ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. గుడివాడ‌లో కాపు సామాజిక వ‌ర్గం ఓట‌ర్లు చాలా ఎక్కువ. అయితే అక్క‌డ ఎప్పుడూ ఆ సామాజిక వ‌ర్గం త‌న హ‌వాను ఫ్రూవ్ చేసుకునేందుకు రాజ‌కీయంగా స‌రైన వేదిక అయితే లేదు. ఎప్పుడూ అక్క‌డ ప్ర‌ధాన పార్టీలు అన్ని క‌మ్మ‌ల‌కే సీట్లు ఇస్తూ వ‌చ్చాయి. అయితే ఇప్పుడు నాని కి చిర‌కాల మిత్రుడిగా ఉన్న రాధాయే అక్క‌డ పోటీ చేసేందుకు సై అంటున్నారు. చంద్ర‌బాబు సైతం ఈ విష‌యంలో కాద‌నే ప్ర‌శ‌క్తే ఉండ‌దు. రాధా పోటీ చేస్తేనే గుడివాడ‌లో 2024 ఎన్నిక‌ల‌లో అస‌లు మ‌జా ఉంటుంద‌ని అంటున్నారు. ఏదేమైనా రాధా గుడివాడ బ‌రిలో ఉంటే నానికి దబిడి దిబిడే అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: