ట్విన్ టవర్స్ కూల్చివేత అనంతరం అమెరికా తీవ్రవాదంపై పోరాటం తీవ్రం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆఫ్ఘన్ లో ఉన్న తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని 20ఏళ్లపాటు పోరాడింది. చివరి నిముషంలో ఓటమి అంగీకరించి తిరిగివచ్చేసింది. అయితే ఈ 20 ఏళ్లలో సుమారు 17 వేలకోట్లు ఖర్చుచేసింది. ఇదంతా కేవలం తీవ్రవాదం అణిచేందుకు అదికూడా ఆఫ్ఘన్ లో మాత్రమే అయిన ఖర్చు. ఈ యుద్ధం 2001-2021 మధ్య జరిగింది. ఇందులో ఖర్చు అయినదానిలో సుమారు 7754.74కోట్లు ఆఫ్ఘన్ లో రక్షణ మంత్రిత్వ శాఖ కార్యకలాపాలకు మాత్రమే పెట్టింది. అంటే అక్కడ నిర్వహణ కు మద్దతుగా అనేక ప్రైవేట్ సంస్థలు ముందుకు రావటంతో అమెరికా వారి నియామకాల కోసం ఈ ఖర్చు చేసింది.

అందుకే ఈ పోరాటంలో అమెరికా సైన్యం ఎక్కువగా లేదు. ఆఫ్ఘన్ లో ఉన్న ప్రైవేట్ సంస్థల  నుండి వచ్చిన వారు కూడా ఎక్కువగా పని చేశారు. ఈ వలంటీర్ల అందరిని మిలిటరీ కాంట్రాక్టర్స్ నియమించారు. వీరందరు కాంట్రాక్ ఉద్యోగులే, అందుకే ఇక్కడ అమెరికా సైన్యం కంటే ఆఫ్ఘన్ ప్రైవేట్ వాలంటీర్ లు ఎక్కువగా ఉన్నారు. దీనితో యుద్దములో పాల్గొన్న వారి సంఖ్య దాదాపు రెట్టింపు అయ్యింది. ఈ మేరకు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో కెనడీ స్కూల్ అఫ్ గవర్నెన్స్ కు చెందిన ప్రొఫెసర్ లిండా బిల్మ్స్ అన్నారు. ఈ కాంట్రాక్టు ఉద్యోగులు  పలు విధులు నిర్వహించేవారు. విమానాలలో ఇంధనం నింపడం, ట్రక్కులు నడపడం, వంట, క్లీనింగ్, హెలికాప్టర్ లను నడపడం ద్వారా  రకాల యుద్ధ సామాగ్రి, పరికరాలు చేరవేసేవారు.

ఈ మొత్తం ప్రక్రియలో ఐదు సంస్థలు లాభాలను పొందాయి. అయితే ఈ పోరాటం కోసం ఆఫ్ఘన్ సహా పలు దేశాల 100 సంస్థల నుండి అమెరికా ఒప్పందాలు కుదుర్చుకుంది. దీనిలో ఐదు మాత్రం బాగా లాభం పొందాయి. అయితే ఈ ఐదు లాభం  సరైన  లేనప్పటికీ  అధికారిక వెబ్ సైట్ డేటా సాయంతో  వేశారు.  2008-2021 కాలానికి మాత్రమే ఈ డేటా ఉంది. అంటే 2001 నుండి గణాంకాలు చుస్తే ఈ సంఖ్య పెరగవచ్చు. మొదటి మూడు సంస్థలు ఆఫ్ఘన్ లోనివే.. డైన్ కార్ప్, ఫ్లూయర్, కెల్లాగ్ బ్రౌన్ అండ్ రూట్(కేబీఆర్) లు ఉన్నాయి. ఇవి లాజిస్టిక్, మేనేజ్మెంట్, రవాణా, పరికరాలు, ఎయిర్ క్రాఫ్ట్ నిర్వహణ, సపోర్ట్  తదితర రంగాలలో సేవలు అందించాయి. నాలుగు ఐదు స్థానాలలో రెథియన్(ఆఫ్ఘన్), ఏజిస్ ఎల్ ఎల్ సి(వర్జీనియా) ఉన్నాయి. ఇవి వైమానిక దళానికి శిక్షణ ఇవ్వడం, కాబుల్ లో అమెరికా రాయబార కార్యాలయానికి  రక్షణ సేవలు అందించాయి. అయితే ఈ ప్రైవేట్ సంస్థలు  అమెరికా ఆయుధాలను దారిమళ్లించి దానిని తోకముడుచుకునేట్టు చేశారా అనేది విశ్లేషకుల సంశయం.

మరింత సమాచారం తెలుసుకోండి: