తమిళనాడు రాష్ట్రంలో కార్పొరేషన్లు, మునిసిపాలిటీలకు నాలుగు నెలలలో ఎన్నికలు నిర్వహించాలని సుప్రీం కోర్ట్ ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఇంకా వాయిదా పర్వం కొనసాగితే ఒప్పుకునేది లేదని తెచ్చి చెప్పింది. ఈ మేరకు జస్టిస్ ఎన్వీ రమణ, సూర్యకాంత్, హేమ గోలీ తో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీచేయింది. గత ప్రభుత్వం 2019లో ఈ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ ఇచ్చింది. మూడువిడతలుగా నిర్వహించేందుకు సిద్ధం అయ్యింది. అప్పట్లో కొత్త జిల్లాల విభజన నేపథ్యంలో 9 జిల్లాలలో ఈ ఎన్నికలు నిర్వహించలేకపోయింది.

దీనితో నిలిచిపోయిన ఆ ఎన్నికలు ఇప్పటివరకు జరగకపోవటంతో స్థానికుడు ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశాడు. స్థానిక సంస్థ ఎన్నికలకు వార్డుల పునర్విభజన జరిపి, 2011 జనాభా ప్రాతిపదికన ఎన్నికలు నిర్వహించే విధంగా ఎన్నికల సంఘానికి ఉత్తర్వులు జారీ చేయాలని అతడు కోర్టులో పిటీషన్ వేశాడు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం పిటిషనర్ కోరిన విధంగా నిర్వహించాలని ఎన్నికల సంఘానికి మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఆ 9 జిల్లాలలో(కాంచీపురం, చెంగల్పట్టు, వేల్పూరు, తిరుపుత్తూర్, రాణిపేట, విల్లుపురం, కాళ్ళకూర్చి, తిరునల్వేరి, టెంకాశి) సెప్టెంబర్ 15లోగ నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఎన్నికల సంఘం కూడా నిర్వహిస్తాం అని హామీ ఇచ్చింది.

దీనితో ఎన్నికల సంఘం అక్టోబర్ లోగ ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి సన్నాహాలు ప్రారంభించింది. 9 జిల్లాలలో రెండు విడతలుగా జరుపనుంది. మళ్ళీ పిటిషన్ విచారణకు రావటంతో ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికలు నిర్వర్తిస్తున్నట్టు ధర్మాసనానికి తెలిపింది. అప్పుడు సుప్రీం కోర్ట్ మరి మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడు నిర్వర్తిస్తున్నారో ప్రభుత్వం తో చర్చలు జరిపి నివేదికను సమర్పించాలని ఆదేశించింది. కానీ మరోసారి విచారణకు వచ్చినప్పుడు సమయం కావాలని అడగటంతో పిటిషనర్ అభ్యన్తరం చెప్పకపోవటంపై సుప్రీం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. ఎన్నికల సంఘం ఆయా ఎన్నికలు నిర్వహణకు ఉపయోగించాల్సిన సామాగ్రి అందుబాటులోకి రావడానికి వచ్చే ఏడాది మార్చ్ వరకు సమయం పడుతుందని చెప్పింది. దానికి సుప్రీం కోర్ట్ నాలుగు నెలలలో కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికలు పూర్తి చేయాలని ఆదేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: