కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి టీ పీసీసీ అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత ఆ పార్టీలో కొత్త జ్యూస్ కనబడుతోంది. కార్యకర్తలు కూడా రేవంత్రెడ్డి సారథ్యంలో పార్టీ బలోపేతం కోసం ముందుకు పోతున్నారు. రేవంత్ రెడ్డి కూడా కష్టపడ్డ ప్రతి కార్యకర్త కు గుర్తింపు ఉంటుందని ప్రకటిస్తూ
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు ఒకప్పటి పార్టీల తయారయ్యేందుకు రేవంత్ అధ్యక్షతన విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అయితే కాంగ్రెస్ లో సీనియర్లకు, రేవంత్ కు మధ్య కోల్డ్ వార్ కొనసాగుతున్న విషయం  అందరికీ తెలిసిందే. అయితే కాంగ్రెస్ సీనియర్లు  ఒకప్పుడు పార్టీ గురించి కష్ట పడ్డట్లుగా, యాక్టివ్ గా ఉన్నట్లుగా ప్రస్తుతం ఉండడం లేదు. అయితే ఒకప్పుడు కాంగ్రెస్ పెద్ద ఎత్తున బలంగా ఉన్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా పని చేయడానికి అర్హతలు ఉన్నాయని పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన పేరు జానారెడ్డి.

అయితే జానారెడ్డి తాజాగా నాగార్జున సాగర్ లో పోటీచేసినా ఓటమిపాలైన విషయం తెలిసిందే. అయితే జానారెడ్డి గెలవక పోవడానికి పార్టీ నేతల మధ్య విభేదాలు చోటు చేసుకోవడమే. అయితే ఇప్పుడు నాగార్జునసాగర్ లో ఓటమి తర్వాత జానారెడ్డి పార్టీలో క్రియాశీలకంగా ఉండడం లేదు. పార్టీ నిర్వహిస్తున్న  అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. తన ఎన్నికల సమయంలో కలసికట్టుగా కృషి చేయలేదనే భావనతోనే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాడన్నా సమాచారం ఉంది.

అయితే ఇందులో ఎంత వరకూ నిజం ఉందనేది తెలియాలంటే జానారెడ్డి నోరు విప్పితే గానీ తెలియదు. అయితే జానా రెడ్డి లాంటి సీనియర్లు ఇప్పటి వరకు ఎలాంటి విభేదాల్లోకి వెళ్లకపోయినా కనీసం కాంగ్రెస్ సీనియర్ నేతగా పార్టీలో ఉన్న విభేదాల నీ, సఖ్యతను కుదిర్చే అవకాశం ఉంది. కానీ జానారెడ్డి వంటి సీనియర్ నేతలు చాలామంది ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్న ఎటువంటి కార్యక్రమాల్లో కూడా యాక్టివ్ గా పాల్గొనడం లేదు. అయితే కాంగ్రెస్ ఎంతలా బలపడిన సలహాలు,సూచనలు అవసరం. రానున్న రోజుల్లో జానారెడ్డి కాంగ్రెస్ లో యాక్టివ్ అవుతారా లేదా చూడాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: