జాతీయ స్థాయిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హవాకు అడ్డుకట్ట వేసేలా... పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భారీ స్కెచ్ వేశారు. ఇందుకోసం ఇప్పటికే భారతీయ జనతా పార్టీ యేతర ముఖ్యమంత్రులు, పార్టీ ముఖ్యనేతలతో సమావేశం కూడా ఏర్పాటు చేశారు దీదీ. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కూడా హాజరయ్యారు. మోదీని అడ్డుకోవాలంటే జాతీయ కూటమి ఏర్పాటు చేయాల్సిందే అని అంతా భావించారు కూడా. కానీ సరిగ్గా రెండు నెలలు కూడా పూర్తి కాకముందే... విపక్షాలు ఏకమయ్యే ప్రయత్నానికి బ్రేక్ పడింది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, congress PARTY' target='_blank' title='నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరత్ పవార్ కూడా తమ వంతు ప్రయత్నాలు చేశారు. కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు జాతీయ స్థాయి కూటమి ఏర్పాటును అడ్డుకునేలా ఉన్నాయి.

దాదాపు ఏడేళ్లుగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. 2014 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పతనావస్థకు చేరుకుంది. చివరికి 2019 ఎన్నికల్లో లోక్ సభలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా హస్తం పార్టీకి దక్కలేదు. దీంతో ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు కోసం విపక్షాలతో చేతులు కలిపేందుకు కూడా హస్తం పార్టీ రెడీ అయ్యింది. ఇందులో భాగంగానే తెలంగాణలో తెలుగుదేశం పార్టీతో జత కట్టింది కూడా. ఇక దీదీతో కలిసి అడుగులు వేసేందుకు కూడా సోనియా రెడీ అయ్యారు. వీరిద్దరి విజయం కోసం ప్రశాంత్ కిషోర్ టీమ్ ఇప్పటికే కార్యాచరణ మొదలుపెట్టింది కూడా. కానీ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, నేతలు కానీ... మమతా బెనర్జీకి అనుకూలంగా ప్రచారం చేయలేదు. పైగా మమతా ముఖ్యమంత్రిగా కొనసాగాలంటే... భవానీపూర్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితి. అయినా సరే.. కాంగ్రెస్ పార్టీ మాత్రం భవానీపూర్ నియోజకవర్గంలో తమ పార్టీ నేతను బరిలో నిలపడం పట్లే అటు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: