సామాజికవర్గాల కొట్లాటలో ఇండస్ట్రీ కొట్టుకుపోతోంది. ముందున్నంత వేగంలో లేదు. కరోనా కారణంగా వీళ్లేమో కరెంటు ఛార్జీలపై రాయితీలు ఇచ్చి థియేటర్లను ఆదుకోండి అంటే జగన్ కనీసం ఒక్కటంటే ఒక్క మాట కూడా పైకి వెల్లడించలేదు. ఇప్పుడు థియేటర్లను తమవైపు లాక్కొని వ్యాపారం చేయాలన్నదే ఒక యోచన అని కొందరు విమర్శలు గుప్పిస్తుంటే, ఈ మొత్తం వ్యవహారంపై టీడీపీ నోట మాట రావడం లేదు ఎందుకని? అన్న వాదన ఒకటి వైసీపీ చేస్తోంది. టీడీపీ హయాంలో బాహుబలి సినిమా పెద్దలు ట్యాక్సులు ఎగొట్టారని ఆరోపణలు వస్తున్నాయి. వీటిలో నిజం ఎంత? పోనీ వైసీపీ వచ్చాక పెద్ద సినిమాలు విడుదలయ్యాయి..వాటిలో మహేశ్ బాబు సినిమాలు కూడా ఉన్నాయి. వాటికి కట్టిన ట్యాక్సులు ఎంత అని పవన్ అభిమానులు అడుగుతున్నారు. ఇలా వివాదం పెరిగి పెద్దదౌతోంది. ఎందుకని?


టూరిజం, ఎంటర్టైన్మెంట్, కల్చర్ వీటిపై అస్సలు శ్రద్ధే లేని ప్రభుత్వానికి సినిమా రంగంపై ఎందుకు ప్రేమ. ఉన్న ఒక్క స్టూడియో (రామానాయుడు స్టూడియో)పై కూడా అనేక అభియోగాలు మోపి, తమ సొంతం చేసుకునేందుకు సురేశ్ ప్రొడక్షన్స్ తో తగువులు పెట్టుకుంటున్నారని వార్తలొస్తున్నాయి. ఈ ప్రాంతంలో సీఎం ఇల్లు కట్టుకుంటారని, ఇక్కడి నుంచి స్టూడియోను కదిలించాలని కూడా చాలా మంది ప్రభుత్వ పెద్దల పన్నాగం. ఇవన్నీ కాదని సినిమాకు జగన్ చేసిన సాయం ఏంటి?


ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ లో సినిమా ఇండస్ట్రీ  పూర్తి స్థాయిలో అడుగు పెట్టింది లేదు. లోకేషన్ల పరంగా కొన్ని పర్యాటక ప్రాంతాలను వాడుకుంటుందే కానీ స్టూడియోల నిర్మాణానికి తనవంతు ప్రయత్నం చేసిందీ లేదు. ఇతరుల ప్రయత్నానికి సహకారం అందించిం దీ లేదు. ఎందుకంటే మినీ థియేటర్ల ఏర్పాటు, కల్చరల్ క్లబ్ ల ఏర్పాటు వీటిన్నింటిపై ప్రభుత్వం దృష్టి సారిస్తే టూరిజం, కల్చర్, ఎం టర్ టైన్మెంట్ విభాగాలు ఎంతో వృద్ధిని అందుకుంటాయి. కానీ జగన్ వీటిపై అస్సలు దృష్టే సారించడం లేదు. ఆ మాటకు వస్తే జగన్ ఇప్పటిదాకా ఏరంగానికీ ఊతం ఇవ్వడం లేదు. పారిశ్రామిక పురోగతి కూడా చెప్పుకోదగ్గ విధంగా లేదు. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీకి జగన్ చేసిన మేలు ఏంటి? అన్న ప్రశ్న ఒకటి వెలుగు చూస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: