ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముందు ఇప్పుడు ఓ పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. ఆయన ఎటు వైపు మొగ్గు చూపాలి అనేదే ఆ ప్రశ్న. దేశ ప్రధానిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రధాని మోదీ... అదే సమయంలో తనను ఈ స్థాయిలో నిలబెట్టిన భారతీయ జనతా పార్టీని కూడా అంతే ఉన్నత స్థానంలో నిలిపారు. ప్రస్తుతం దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయ పార్టీ అనేది లేకుండా మోదీ స్కెచ్ వేశారనేది రాజకీయ విశ్లేషకుల మాట. పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 300 స్థానాలను గెలుచుకుందంటే... అది మోదీ ప్రభావమే అంటున్నారు కూడా. మోదీ మాటకు దేశ ప్రజలు ఫిదా అయ్యారు. ప్రపంచ దేశాల్లో ఆయనో బలమైన నేతగా కూడా ఎదిగారు. ఇదే సమయంలో దేశంలోని మెజారిటీ రాష్ట్రాల్లో కమలం పార్టీ అధికారంలోకి రావడానికి కూడా మోదీ కృషి ఉందనే మాట అక్షర సత్యం. అయితే ఇప్పుడు నరేంద్ర మోదీ ముందు రెండు క్లిష్టమైన దారులు ఎదురుచూస్తున్నారు.

వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో దేశంలో ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అందులో ప్రధానమైనవి ఉత్తరప్రదేశ్, గుజరాత్. మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో ఇప్పటికే వరుసగా ఆరు సార్లు బీజేపీ అధికారంలోకి వచ్చింది. కమలం డబుల్ హ్యాట్రిక్ వెనుక మోదీ కృషి ఉంది. అయితే... 2014 లోక్‌సభ ఎన్నికల తర్వాత జరిగిన గుజరాత్ ఎన్నికల్లో కమలం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇంకా చెప్పాలంటే... బోటాబోటీ మెజారిటీతో గట్టెక్కింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ దాదాపు గెలిచినంత పని చేసింది కూడా. ఇప్పుడు అదే రాష్ట్రంలో మరోసారి పార్టీని అధికారంలోకి తీసుకు రావటం మోదీ ముందు పెద్ద టాస్క్. అలాగే దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కూడా పార్టీ గెలుపు బాధ్యత మోదీదే. ప్రధాని మోదీ పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గం ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోనే ఉంది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో పార్టీ ఓడితే... అది తాను ఓడినట్లే అనేది మోదీ భావన. దీంతో మోదీ దృష్టి ఏ రాష్ట్రంపై పెడతారో చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: