తాజాగా జ‌రుగుతున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌.. వైసీపీ మంత్రుల‌కు మ‌ధ్య వివాదం రెండు కీల‌క సామాజిక వ‌ర్గాల ర‌గ‌డ‌గా ప్ర‌జ‌లు చూస్తున్నారా? ఆవ‌ర్గాలుకూడా ఇలానే భావిస్తున్నాయా? అనేది చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఎందుకంటే.. కాపు నాడు.. నాయ‌కులు.. తాజాగా స‌మావేశ‌మై.. క‌మ్మ‌-కాపుల మ‌ధ్య వివాదాలు పెరుగుతున్నాయ‌ని.. మంత్రులు, ప‌వ‌న్ కూడా వెన‌క్కి త‌గ్గ‌క‌పోతే.. మున్ముందు.. మ‌ళ్లీ పాత రోజులు వ‌స్తాయని చెబుతూ.. వంగ‌వీటి రంగా నాటి రోజుల‌ను గుర్తు చేశారు. అయితే.. దీనిలో వాస్త‌వం ఉందా? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌.

ఎందుకంటే.. అటు కాపుల్లోనూ, ఇటు క‌మ్మ సామాజిక వ‌ర్గంలోనూ మునుపు ఉన్న ఐక్య‌త ఇప్పుడు లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. కాపు నాడు నేత‌లు చెప్పిన‌ట్టు.. గ‌తంలో వంగ‌వీటి రాధా, దేవినేని రాజ‌శేఖ‌ర్ వ‌ర్గాలు బ‌లంగా ఉన్న‌ప్పుడు.. ఈ రెండు సామాజిక వ‌ర్గాల మ‌ధ్య ఉప్పు-నిప్పుగ‌గా ఉండేది. ప‌ర‌స్ప‌రం కేసులు పెట్టుకున్నారు. రాజకీయంగా కూడా.. ఒక‌రిపై ఒక‌రు దూకుడు ప్ర‌ద‌ర్శించారు. దాడులు చేసుకున్నారు.

సో.. ఆ నాటి ప‌రిస్థితి అలా ఉంటే.. నేడు కూడా అలానే ఉన్నారా? అంటే.. కాద‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటు.. ఇప్పుడు అవ‌స‌రానికి త‌గిన విధంగానే కాపులు, క‌మ్మ‌లు మారిపోతున్నారు.
పార్టీ అధికారంలో ఉంటే.. ఆ పార్టీ అజెండాల‌నే మోస్తున్నారు త‌ప్ప‌.. ఎవ‌రినీ ప్ర‌త్యేకంగా న‌మ్మే ప‌రిస్థితి లేదు. పైగా ఎవ‌రు అధికారంలోకి వ‌చ్చినా..త మ‌కు న్యాయం జ‌ర‌గ‌డం లేద‌నే వాద‌న కూడా వీరిలో వినిపి స్తోంది. నిజంగా ఆయా సామాజిక వ‌ర్గాల్లో ఐక్య‌తే ఉంటే.. చంద్ర‌బాబు ఇంటిపై దాడి జ‌రిగిన‌ప్పుడు(టీడీపీ ఆరోప‌ణ ప్ర‌కారం) రాష్ట్ర వ్యాప్తంగా క‌మ్మ వ‌ర్గం ఏకం కావాలి. కానీ, అలా జ‌ర‌గ‌లేదు.

ఇక‌, కాపుల‌కు సంబంధించి కూడా ఇలానే ఉంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ విష‌యం కానీ.. మంత్రి పేర్ని విష‌యం  కానీ.. జ‌రిగిన‌ప్పుడు కాపు వ‌ర్గం బ‌య‌ట‌కు వ‌చ్చి.. ఇద్ద‌రికీ స‌ర్ధి చెప్పాలి కానీ, అలా జ‌ర‌గ‌లేదు. దీనిని బ‌ట్టి.. ఎవ‌రికి వారుగా రాజకీయాలు చేసుకుంటున్నార‌నే త‌ప్ప‌.. కాపు నాడు ఆందోళ‌న చెందినంత సీన్ ఇప్పుడు రాష్ట్రంలో లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎవ‌రికివారే అన్న‌ట్టుగా ఉన్న కాపులు, క‌మ్మ‌ల వ్య‌వ‌హారం.. ఇక‌పైనా ఇలానే ఉంటుంద‌ని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: