నగరి నియోజకవర్గంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. నగరిలో గత రెండు పర్యాయాల నుంచి రోజా విజయం సాధిస్తూ వస్తున్నారు. అయితే భారీ మెజారిటీలతో ఏమి రోజా గెలవలేదు...2014లో ఒక వెయ్యి ఓట్లు....2019 ఎన్నికల్లో 2 వేల ఓట్లతో గట్టు ఎక్కారు. అంటే రెండు సార్లు టి‌డి‌పి ఎంత పోటీ ఇచ్చిందో అర్ధమవుతుంది. కానీ ఇప్పుడు అధికారంలో ఉండటంతో నగరిలో రోజా హవా ఉంటుందని అంతా అనుకున్నారు.

కాకపోతే ఊహించని రీతిలో ఆమెకు షాకులు తగులుతున్నాయి. అది కూడా సొంత పార్టీ నుంచే రోజాకు అదిరిపోయే షాకులు వస్తున్నాయి. దీంతో అధికారంలో ఉన్నమనే ఆనందం కూడా రోజాకు ఉన్నట్లు కనిపించడం లేదు. మంత్రి పదవి ఎలాగో రాలేదు...ఇచ్చిన ఏ‌పి‌ఐ‌ఐ‌సి ఛైర్మన్ పదవి కూడా పోయింది. మంత్రి పదవి వస్తుందో లేదో క్లారిటీ లేదు. పైగా తన సొంత నియోజకవర్గంలో ఒక ఎంపీపీని గెలిపించుకోలేని స్థితిలో రోజా ఉన్నారు.

ఇటీవల నిండ్ర మండలం ఎంపీపీ విషయంలో రోజాకు మద్ధతు లేకుండా పోయింది. మండలంలో ఉన్న 8 ఎం‌పి‌టిసి స్థానాల్లో వైసీపీ 7 గెలవగా, టి‌డి‌పి ఒకటి గెలిచింది. అయితే 7లో నగరిలో రోజాకు ప్రత్యామ్నాయంగా రాజకీయం చేస్తున్న చక్రపాణి రెడ్డికి 5 గురు ఎం‌పి‌టి‌సిలు మద్ధతు ఇస్తున్నారు. ఆయన ఎంపీపీ అభ్యర్ధిని డిసైడ్ చేసుకున్నారు. రోజా టి‌డి‌పి ఎం‌పి‌టి‌సిని కూడా కలుపుకుని ముగ్గురుతో హడావిడి చేశారు. కానీ వర్కౌట్ అవ్వలేదు. పైగా చక్రపాణి డైరక్ట్‌గా రోజాకు వార్నింగ్ ఇస్తున్నారు. గత రెండు ఎన్నికల్లో తమ మద్ధతుతోనే రోజా గెలిచారని, దమ్ముంటే నెక్స్ట్ ఇండిపెండెంట్‌గా గెలిచి చూపించాలని సవాల్ విసురుతున్నారు.

ఇలా వైసీపీలో ఉన్న లుకలుకలు రోజాకు బాగా ఇబ్బంది  మారాయి. ఆమెకు వ్యతిరేకంగా నగరిలో పరిస్తితులు మారాయి. ఇలాంటప్పుడే టి‌డి‌పి నేత గాలి భాను ప్రకాష్ దూకుడు మొదలుపెట్టాలి. వైసీపీలో ఉన్న ఆధిపత్య పోరుని తనకు అనుకూలంగా మార్చుకుంటే నెక్స్ట్ ఎన్నికల్లో సత్తా చాటవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: