సాధారణంగా దేశంలో అధిక పర్  క్యాపిటా  ఉన్న నగరం అంటే మనం చదువుకున్న దానిప్రకారం ముంబై, ఢిల్లీ, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ అని చెప్పేస్తాం. కానీ అవేమి కావు. గుజరాత్ లోని రాజ్ కోట్ కి 60 కి.మీ. దూరంలో ఈ మోర్బీ ఉంది. దీనిలో 2.4లక్షల జనాభా ఉన్నట్టు 2018లో తేల్చారు. కానీ అందులో 1.4 లక్షల మందికి ఉద్యోగాలు ఉన్నాయి. ఈ పట్టణంలో 1200 సిరామిక్ యూనిట్లు, 1000 వజ్రాల యూనిట్లు, 1000 టెక్స్టైల్ యూనిట్లు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యుత్తమమైన  గోడ గడియారాలలో ఒకటైన సమయ్ గోడ గడియారం ఇక్కడే ఒక కుటీర పరిశ్రమలో తయారీ అవుతుంది.

దేశంలోనే అత్యధిక పర్ క్యాపిటా ఇన్ కం కలిగిన ఈ పట్టణంలో చాలా మంది పదోతరగతి కూడా పూర్తిచేయలేదు.వాళ్లందరికీ ఆంగ్లభాష ఒక్క వాక్యం కూడా రాదు. ఈ పట్టణంలో పర్యటించిన ఒక ప్రముఖ ఆర్థిక వేత్త ఇక్కడి వారి గురించి ఒక  వ్యాఖ్యలు చేశారు.  ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్న వారు విద్యావంతులు, ఉద్యోగాలు ఇచ్చిన వారు మాత్రం అవిద్యా వంతులు అన్నారు ఆయన. అలాగే తమిళనాడులోని తిరుపూర్ పట్టణంలో కూడా భారీవ్యాపార కేంద్రం. ఈ ఒక్క పట్టణం నుండే ఏడాదికి 600కోట్ల రూపాయల దుస్తులు ఎగుమతి చేస్తుంది. నిత్వా,  ఇక్కడ పనిచేస్తున్న వారిలో చాలా మంది విద్యలో కనీసం ఐదో తరగతి కూడా దాటలేదు. కొద్ది మంది మాత్రం డిగ్రీ చదివిన వారు ఉన్నారు.

నేటి ప్రపంచంలో ఉద్యోగం అంటే ఆంగ్లభాష వచ్చి  ఉండాలి, కోటు సూటు వేసుకొని ఉండాలి, పెద్ద పెద్ద చదువులు ఉండాలి అనేవి లేకుండానే అనేక పట్టణాలు దేశానికి మార్గదర్శకంగా ఉన్నాయి. అయితే వీళ్ళందరూ వారివారి కష్టంతో ఇంత గొప్పగా వారి పట్టణాలకు వెలుగు తెచ్చుకున్నారు. కానీ ఎంతో చదువుకొని, ఏమి చేయలేని వారిని రోజు చూస్తుంటాం. ఒక చిన్న పరిశ్రమతో మొదలు పెట్టి పెద్ద పెద్ద విజయాలు  సాధించిన వారు మనదేశంలో ఇటీవల పెరిగిపోతున్నారు. ఇటువంటి వారికి పెద్ద చదువులు లేవు, కోటు సూటు లేవు, అయినా నిరూపించుకున్నారు. అది ప్రస్తుతం దేశంలో రావాల్సిన కనువిప్పు. గత వందేళ్లుగా మన దేశం కమ్యూనిస్ట్ ఆర్థిక విధానాన్ని, అనంతరం క్యాపిటలిస్ట్ ఆర్థిక విధానాన్ని అనుసరిస్తూ చాలా దెబ్బతిన్నది. 1750 లో ప్రపంచ జీడీపీలో భారత్ వాటా 24.5 శాతం. అదే సమయంలో ఇంగ్లాండ్  వాటా 1.8 శాతం, అమెరికాది 0.1 శాతం, కానీ ఇప్పుడు అమెరికా వాటా 24.5 శాతం, భారత్ వాటా 3.28 శాతం గా ఉంది.  

ఇక్కడ అమెరికాకు క్యాపిటలిస్ట్ ఆర్థిక విధానం బాగా నప్పింది. దానిని చూసి అందరు అదే అనుసరించడం వలన నష్టం జరుగుతుంది తప్ప లాభం ఉండదు. అమెరికాకు అది నప్పినట్టు, ఒక్కోదేశానికి ఒక్కోటి నప్పుతుంది. అక్కడ వనరులు తదితర పరిగణలోకి తీసుకోని ఏ విధానం వారికీ సరిపోతుందో కనుక్కొని దానిప్రకారంగా  ముందుకుపోవాల్సి ఉంటుంది. భారత్ కు ఏది మంచిది అంటే స్వదేశీ(భారతీయుల చేత, భారతీయుల కోసం, భారతీయులకు మేలుచేసేది, అవసరం అయితే తప్ప విదేశీ  వాడకుండా ఉండటం). ఫై రెండు  ఆర్థిక విధానాలు భారతదేశానికి నప్పవు, మూడోది ధార్మిక ఆర్థిక విధానం. ఈ విధానం ద్వారానే తాజా కరోనా వాక్సిన్ ఉత్పత్తి, వితరణ జరిగాయి.  ఇతర దేశాల ఆర్థిక విధానాలతో ఆయుధాలు ఉత్పత్తి అయితే, భారత ఆర్థిక విధానంతో వాక్సిన్ ఉత్పత్తి అయ్యిందని ఇప్పటికే ప్రపంచానికి భారత్ నిరూపించింది. ప్రపంచానికి మేలు చేయగలిగిన హృదయం, సత్తా కేవలం భారత్ కు మాత్రమే ఉన్నాయని ఈ విధానం వలన నిరూపించుకుంది. భారత్ లో తయారైన టీకాలు 110 దేశాలకు అందించింది. ఈ విధానం వలన భారత్ లో సంస్కరణలు ప్రపంచానికి మేలు చేస్తాయని  నిరూపించుకుంది. అందుకే ఇటీవల 4వ సారి ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించిన భారత ప్రధాని మోడీ మొదటి మాటగా ప్రజాస్వామ్యానికి మాతృదేశం నుండి వచ్చిన నేను అంటూ ప్రారంభించి, 140 కోట్ల జనాభా కలిగిన భారత్ లో సంస్కరణలు మొదలయ్యాయి, అటువైపు శరవేగంగా వెళ్తుంది భారత్, ఇది ప్రపంచానికి మేలు చేస్తుంది అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: