వాతావరణ సమతుల్యత సాధించాలనే లక్ష్యంతో ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ ముందుకు సాగుతున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పటికే పెట్రోల్, డీజీల్ వినియోగాన్ని తగ్గించాలని ఐక్య రాజ్య సమితి తీర్మానం కూడా చేసింది. వాతావరణ మార్పులు లేకుండా చేయాలనేది పర్యావరణ వేత్తల విజ్ఞప్తి కూడా. ఇబ్బంది ముబ్బడిగా పెరుగుతున్న కర్బన ఉద్గారాల ప్రభావాన్ని తగ్గించడం ద్వారా వాతావరణ సమతుల్యత సాధించవచ్చని సూచించారు ప్రకృతి ప్రేమికులు. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ కూడా వాతావరణ మార్పుల వైపు దృష్టి సారించాయి. వీటి ప్రభావం ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది కూడా. అయితే ఇక్కడే అసలు సమస్య ప్రారంభమవుతోంది. సంప్రదాయ ఇంధన వనరుల వాడకాన్ని తగ్గించాలని ఇప్పటికే ప్రపంచ దేశాలు తీర్మానం కూడా చేశాయి. అలాగే పునరుత్పాదక వనరులపై కూడా పెద్ద ఎత్తున దృష్టి సారించాయి.

వాతావరణ మార్పులు లేకుండా చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ఇప్పుడు ప్రపంచ దేశాలకు తలనొప్పిగా మారాయి. ప్రపంచంలోనే బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతోన్న చైనా కూడా... ప్రస్తుతం ఇదే సమస్యను ఎదుర్కొంటోంది. చైనాలో ఇప్పటికే విద్యుత్ కోతలు... ఆ దేశ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇక చమురు ధరల ఆకాశాన్ని అంటడంతో.... బ్రిటన్ సహా యూపర్ దేశాలన్నీ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం పునరుద్పాదక వనరులపై దృష్టి పెట్టిన ప్రపంచ దేశాలకు వాటి ఫలితాలు ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు. దీంతో మళ్లీ సంప్రదాయ వనరులను వాడుకునే పరిస్థితి తప్పనిసరి అయ్యింది. ప్రస్తుతం ఉత్తర చైనా ప్రాంతం గతంలో ఎన్నడూ లేనంతగా విద్యుత్ కోతలతో సతమతమవుతోంది. మిలియన్ల మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ కోతల కారణంగా చాలా పరిశ్రమలు మూత పడుతున్నాయి. దీంతో లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. ఇక బ్రిటన్‌లో అయితే... చమురు కోసం పెట్రోల్ బంకుల వద్ద వాహనాలు బార్లు తీరుతున్నాయి. ఎలాంటి కోరత లేదని కంపెనీలు చెబుతున్నా కూడా... వినియోగదారులు నమ్మడం లేదు. బ్రెగ్జిట్ ప్రభావంతో యూరప్ దేశాలకు చెందిన డ్రైవర్లు బ్రిటన్‌లో ప్రవేశించేందుకు అనుమతి లేదు. దీంతో బ్రిటన్ ప్రభుత్వం తక్షణమే పది వేల మంది డ్రైవర్లు దేశంలోకి వచ్చేందుకు ప్రధాని బోరిస్ జాన్సస్ అనుమతి ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: