జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను జగన్ సర్కార్ సీరియస్ గా తీసుకుందా ?నిన్న మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న జనసేనాని జగన్ సర్కార్ పై విమర్శల దాడి నేపద్యంలో వైసీపీ సీరియస్ గా ఫోకస్ పెట్టిందా?  కులాలు, మతాలు అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఏమంటున్నారు? అసలు పవన్ వ్యాఖ్యలపై వైసీపీలో ఎందుకు చర్చ జరుగుతోంది.? పవన్ కళ్యాణ్ విషయంలో వైసీపీ ఎలా ముందుకు వెళ్ళబోతుంది.
.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడుతోంది అధికార వైసీపీ.ఓ ఆడియో ఫంక్షన్ వేదికగా,జనసేన సభలో  పవన్ చేసిన విమర్శల్ని సీరియస్ గా తీసుకున్న వైసీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ విషయంలో వెనక్కు తగ్గకూడదని నిర్ణయానికి వచ్చిందట  అందులో భాగంగానే  పవన్ చేసిన ప్రసంగంలో ప్రతి అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.సినిమా ఇండస్ట్రీలో ఎపి ప్రభుత్వం  తీసుకొస్తున్న సంస్కరణల విషయంలో ఏ ఒక్కరికి లేని భేదాభిప్రాయాలు ఒక్క పవన్ కళ్యాణ్ కు మాత్రమే ఎందుకు వచ్చాయని ఈ విషయంలో పవన్ ఎందుకంత అసహనం వెలిబుచ్చారన్న కోణంలో ఆరా తీస్తున్నారట వైసీపీ కొందరు మంత్రులు.ఇప్పటికే  ఏపీ ప్రభుత్వంపై పొలిటికల్ గా టార్గెట్  చేసి విఫలమైన పవన్ ఇప్పుడు ఇండస్ట్రీని అడ్డం పెట్టుకొని సంబంధం లేని వేదికపై  ప్రబుత్వంపై ఎందుకు ఈ స్థాయిలో విమర్శలు గుప్పించారన్న చర్చ పెద్ద ఎత్తున నడుస్తోంది.ఇప్పటికిప్పుడు ప్రభుత్వం ఎక్కడా కూడా  ఏకపక్షంగా సిని  ఇండస్ట్రీ పెద్దల విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకోలేదని కానీ ఎవరూ అభ్యంతరం చెప్పకపోయినా ఎందుకు అక్కసు వెళ్లగక్కారన్నా విషయంలో ఇప్పుడు సీరియస్ గా ఫోకస్ పెట్టారట ఇప్పటికే సినీ పెద్దలతో భేటీ అయిన ఏపీ ప్రభుత్వం వారు తీసుకొచ్చిన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని భవిష్యత్లో ఒక వేదికపైకి తీసుకొచ్చి ఇరువురు ఆమోదంతో సినీ ఇండస్ట్రీ పాలసీలో మార్పులు  చేస్తామని అది కూడా ఇప్పటికిప్పుడు సాధ్యం కావని ప్రత్యేకమైన వ్యవస్థలను అందుబాటులోకి తీసుకొచ్చి అమలు చేయాలని ఆలోచనలో ఉన్న వేళ ఇప్పుడు ఎందుకు ఇంత ఇష్యూ చేసారని వైసీపీ నేతల మధ్య జోరుగా చర్చ నడుస్తోంది.



ఇదిలా ఉంటె పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల విషయంలో వైసీపీ ఆచితూచి అడుగులు వేస్తోంది.ఇప్పటికే పవన్ పొలిటికల్ ఎంట్రీ తరువాత  వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న  వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తు  మాట్లాడుతూన్న అంశాల విషయంలో ఆలోచించి మాట్లాడాలని సూచించినట్లు సమాచారం. అందులో భాగంగానే మొన్న ఆడియో ఫంక్షన్,జనసేన విస్తృత సమావేశం వేదికగా  పవన్ తీవ్ర విమర్శలు గుప్పించిన  అనవసరంగా చర్చకు కారణం కాకూడదని మంత్రి పేర్ని నాని  సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొన్ని అంశాలను వాటికి సంబంధించిన జీవోలు గతంలో ఇండస్ట్రీ పెద్దలు ఇచ్చిన  అనేక వినతులతో మీడియా ముందుకు వచ్చారట .పవన్ చేసిన ప్రతి విమర్శను చెప్తూనే దీనిపై వివరణ ఇవ్వాలంటూ కౌంటర్లు వేశారు మంత్రి పేర్ని నాని.అయితే పవన్ ఇండస్ట్రీ పరంగా చేసిన లేదా పొలిటికల్ గా చేసిన పవన్ కళ్యాణ్ ని మాత్రం ఎక్కడ తక్కువ అంచనా వేయకుండా ఎప్పటికప్పుడు కట్టడి చేసేలా చర్యలు తీసుకోవాలని పార్టి లోని పలువురు నేతలకు  అదేశాలు  ఇచ్చినట్లు తెలుస్తోంది.


మరోవైపు పవన్ చేస్తున్న ప్రతి విమర్శలొను రాజకీయ కోణం ఉందని భావిస్తున్నారు వైసీపీ నేతలు.ఇండస్ట్రీకి సంబంధించిన వివాదంపై మాట్లాడాల్సిన వేదికపై కులాలు,మతాలు అంటూ రెచ్చగొట్టే  విమర్శలు చేయడం ఇప్పుడు వైసీపీ నేతలకు  రుచించడం లేదు. అందులో భాగంగా అస్సలు పవన్ వ్యాఖ్యలు చేయడం వెనుక ఉన్న ఉద్దేశం అస్సలు ఈ మొత్తం వ్యవహారంలో పవన్  ఎందుకంత  సీరియస్ గా  ఉన్నారని ఆరా తీస్తున్నారట వైసీపీ నేతలు.ఇప్పటికే సినీ పెద్దలతో మాట్లాడి పవన్ చేసిన వ్యాఖ్యల విషయంలోను గతంలో పవన్ సినిమా హీరో నటించిన,ఏపీలో పవన్ కళ్యాణ్ సన్నిహితులు ప్రొడ్యూస్, డైరెక్ట్,ఎక్స్బిట్ చేసిన  అన్ని వివరాలను తెప్పించుకొని  పవన్ విమర్శలకు చెక్ పెట్టాలని చూస్తున్నారట.ఒకవేళ పవన్ దీనిని అడ్డం పెట్టుకొని  రాజకీయా పరమైన అంశాలను తెరపైకి తెస్తే  ఇప్పటికే పొత్తు పెట్టుకొని బయటకు వచ్చిన టీడీపీని,పొత్తు ప్రయాణము చేస్తున్న బీజేపీతో ఒప్పించాలని విమర్శలను తిప్పి కొట్టాలని చూస్తున్నారట.మొత్తానికి పవన్ కళ్యాణ్ విషయంలో వైసీపీ ఆచితూచి అడుగులు వేస్తుంధీ పవన్ చేస్తున్న ప్రతి విమర్శను లైట్ తీసుకోవద్దని భావిస్తున్న వైసీపీ నేతలు ఎట్టి పరిస్థితుల్లో తిప్పికొట్టాలని చూస్తున్నారట చూడాలి మరి రాబోయే రోజుల్లో పవన్ తో వైసీపీ నేతల వార్ ఎలా ఉండబోతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: