ప్రభుత్వ చర్యలతో ప్రతిపక్ష టీడీపీ నేతలు భయపడుతున్నారా.వరుస కేసులతో సీనియర్లను ప్రభుత్వం టార్గెట్ చేస్తుంటే టీడీపీ నేతల్ని  బయం వెంటాడుతొందా.ఒక్కొక్కరుగా కేసుల జాభితాలో చేరుతున్న వేల టీడీపీ నేతలు ఏమంటున్నారూ.అధినేత నుంచి యువనేత వరకు కేసుల జాబితాలోకి వెళ్తున్న వెళ్తున్న ఎపి టీడీపీ నేతల్లో  అంతర్మథనం ఏంటి?


ఏపీలో వరుసగా జరుగుతున్న పరిణామాలు ప్రతిపక్ష టీడీపీకి మింగుడు పడటం లేదట. వరుసగా టీడీపీ సీనియర్లు, మాజీ మంత్రులు,మాజీ ఎంపీలపై సీఐడీ,ఎసిబి, లాంటి దర్యాప్తు సంస్థలు కేసులు నమోదు చేస్తు ఉండటంతో సీనియర్లలో ఆందోళన నెలకొందని ఎన్టీయార్ భవన్ వేధికాగా పెద్ద చర్చ నడుస్తోంది.టీడీపీ అధికారంలో ఉన్మ సందర్భంగా జరిగిన అక్రమాలను కొత్తగా ఏర్పాటు అయిన జగన్ సర్కార్ తిరగదోడి విచారణ చేపట్టడం,వాటిలో టీడీపీలో బడా నేతలపై కేసులు నమోదు చేస్తూ ఉండటం టీడీపీలోని కొందరి నేతలకు కొత్త టెన్షన్ తెచ్చిపెట్టిందట,రెండు సంవత్సరాల  కాలంలో రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర, వరకు టీడీపీలో ముఖ్య నేతలపై కేసులు నమోదు చేయడం అందుకు  ఆధారాలు వెలుగులోకి తీసుకువస్తుండటంతో రేపు తమ పరిస్థితి వస్తే ఏంటని ఆందోళన చెందుతున్నారట.ఇప్పటికె అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్ పైన కేసులు నమోదు చేసిన దర్యాప్తు సంస్థలు గతంలో కీలకమైన పదవులు అనుభవించిన తమ పరిస్థితి భవిష్యత్లో ఎలా ఉంటుందోనని లోలోపల మదనపడుతున్నారట.

కొద్ది కాలంగా టీడీపిలో సీనియర్ల నుంచి ఒకవైపు అసంతృప్తితో ఎదురవడం మరోవైపు వరుస అరెస్టులతో కొందరు టీడీపీ సీనియర్లు గడప కూడా దాటడం లేదట.రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న పరిణామాలతో కేవలం మొక్కుబడి కార్యక్రమాలకు మాత్రమే హాజరవడంతో అధినేత నిర్వహించే సమావేసాలకు మాత్రం హాజరై మమా అనిపిస్తున్నారట.పైగా పార్టీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్య అతిగా ఆవేశపడి వివాదాలకు పోయి కేసుల్లో ఇరుక్కోవడం కంటే సైలెంట్ అవ్వడం బెటర్ అని టీడీపీ సీనియర్లు జోరుగా చర్చించుకుంటున్నారు.అయితే వరుస కేసులు రాజకీయా వివాదాలు ఇలా ఉంటే పార్టీ కేంద్ర కార్యాలయం పిలుపుకి స్పందించేందుకు  సైతం టీడీపీలో చాలా మంది నేతలు ముందుకు  రావడం లేదట ఈ మధ్య కాలంలో పార్టీ తరపున సమావేశం నిర్వహించాలని సందేశం పంపిన కాని చాలా మంది టీడీపీ నేతలు మౌనం వహిస్తూ ఏదో ఒక కారణం సాకుగా చూపిస్తూ తప్పించుకుంటున్నారట.దీనితో పార్టీలో నెలకొన్న పరిస్థితులు వరుసగా జరుగుతున్న పరిణామాలపై  మాత్రం తెలుగు తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారుఇదిలా ఉంటె తప్పులు చేయనప్పుడు టీడీపీ సీనియర్లు కానీ మాజీ మంత్రులు కానీ భయపడాల్సిన అవసరం ఏమి ఉందని టీడీపీలోని ఒక వర్గం నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈమధ్య కాలంలో జరిగిన అరెస్టులు, కేసులు వివాదాలకు ఆధారాలు ఉన్నాయని అందులో భాగాంగానే అరెస్టులు జరుగుతున్నాయని అయినా కేసులకు భయపడి వెనక్కు తగ్గితే రాబోయే రోజుల్లో పార్టి పరిస్థితి ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు.ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించిన చాలా మంది పోరాటం చేస్తుంటే అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి కష్ట కాలంలో మాత్రం ముందుకు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు పార్టీ అధ్యక్షుడు, అధినేత, యువనేత ఒంటరి పోరు కొనసాగిస్తే ప్రబుత్వ చర్యలపై ఆయా జిల్లాల్లోని సీనియర్లు,ముఖ్య నేతలు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నిస్తున్నారట.కొద్ది కాలంగా జరిగిన కేసులు,రాజకీయ వివాదాల  విషయంలో ఇప్పటికె పార్టి అధిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చిన  కొందరు నేతలు మొక్కుబడిగా పర్యటనలకు,మాత్రమే పరిమితమయ్యారని ఇప్పటికైనా ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేస్తే టీడీపీ బలోపేతం అవ్వడానికి అవకాసం ఉంటుందని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు.మొత్తానికి వరుసగా టీడీపీ నేతలపై కేసులై నమోదు అవడంపై టీడీపీలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. చూడాలి ప్రస్తుతం రాజకీయ పరిణామాలు నేపద్యంలో టీడీపీలో కొందరు నేతలు ఇప్పటికైనా మేల్కొంటారో లేదు

మరింత సమాచారం తెలుసుకోండి: