ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొంతమంది మీద చర్యలు తీసుకోకపోతే మాత్రం పార్టీ క్షేత్రస్థాయిలో నష్టపోయే అవకాశాలు ఉంటాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీలో కీలక నాయకులు ఈ మధ్య కాలంలో పెద్దగా మాట్లాడే ప్రయత్నం చేయటం లేదు. అదే విధంగా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా పెద్దగా బయటకు రావడం లేదు. నియోజకవర్గాల్లో తమ వ్యక్తిగత ఇమేజ్ ను కాపాడుకునేందుకు చాలా మంది ఎమ్మెల్యేలు ప్రయత్నం చేస్తున్నారని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ప్రధానంగా చిత్తూరు జిల్లాలో కొంతమంది నాయకులు వ్యక్తిగత ఇమేజ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అదేవిధంగా కర్నూలు జిల్లాలో నెల్లూరు జిల్లాలో కూడా ఇదేవిధంగా పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు. కొంతమంది మంత్రులు కూడా ఇదే విధంగా ప్రయత్నాలు చేయడంతో పార్టీ అధిష్టానం ఎక్కువగా ఇబ్బంది పడుతుందని సమాచారం. రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం గడ్డు పరిస్థితులు చాలా వరకు జాగ్రత్తగా ముందుకు వెళ్లాల్సి ఉంది.

ఎటువంటి పరిస్థితులు అయినా ఏ విధంగా అయినా సరే మారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కాస్త ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే మాత్రం భవిష్యత్ పరిణామాలు మరింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. అయితే కొంత మంది ఎమ్మెల్యేలు అసలు మీడియా ముందుకు రాకపోవడం కొంతమంది మంత్రులు కూడా పెద్దగా మాట్లాడక పోవడం మాట్లాడిన మంత్రులు కూడా అర్థం పర్థం లేకుండా మాట్లాడటం వంటివి కాస్త ఇబ్బందికరంగా మారుతున్నాయి. రాజకీయంగా భవిష్యత్ పరిణామాలను అంచనా వేసుకుని ముందుకు వెళ్లాల్సిన తరుణంలో చాలా వరకు తప్పులు ఎక్కువగా చేస్తున్నారు అనే భావన కూడా కొంతవరకు ఉంది. మరి భవిష్యత్తులో ఇటువంటి రాజకీయ వ్యక్తిగత ఇమేజ్ కోసం ప్రయత్నాలు చేస్తున్న ఎమ్మెల్యేల మీద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక కన్నేసి ఉంచారని కూడా రాజకీయ వర్గాలు అంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp