బీజేపీ ప్రభుత్వం గద్దెనెక్కిన ప్పటినుంచి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రవేట్ పరం చేస్తూ వస్తోంది. ఇప్పటికే చాలావరకు రైళ్లను ప్రైవేటుకు అప్పగించింది. అలాగే దేశంలో ప్రైవేటు యూనివర్సిటీ తీసుకురావడానికి కసరత్తు ప్రారంభించింది. దీంతోపాటుగా ఎల్ఐసి ఇంకా ఇతరాత్రా  ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేసేందుకు ఉద్దేశించిన బిల్లులను పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చేందుకు మోడీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించి రానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బిల్లులను ప్రవేశపెట్టే యోచనలో ఉంది. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలానే తన ఎజెండాను పూర్తి చేయాలన్న లక్ష్యంగా పెట్టుకున్న మోడీ ప్రభుత్వం, రాబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం - 1949లో సవరణలను ప్రవేశపెట్టే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అలాగే బ్యాంకుల ప్రైవేటీకరణ కోసం బ్యాంకింగ్ కంపెనీల చట్టం- 1980లో సవరణలు చేస్తామనిసంబంధిత వర్గాలు తెలిపాయి.ఈ రెండు బిల్లులను కూడా శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలిపారు.

ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న కాలంలో బ్యాంకుల జాతీయీకరణ సమయంలో చేసిన ఈ చట్టాలను మోడీ సర్కార్ సవరణలు చేసేందుకు సిద్ధపడింది. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలంటే, ఈ చట్టంలోని నిబంధనలను సవరించాల్సి ఉంటుంది. ఈ సవరణలతో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాను ప్రస్తుతం ఉన్న 51 శాతం నుంచి తగ్గించే అవకాశం ఉంది.

అయితే ప్రైవేటీకరించాల్సిన రెండు బ్యాంకులను ప్రభుత్వం ఇంకా గుర్తించలేదు. కనీసం రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలని యోచిస్తున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ గతంలోనే చెప్పారు. ప్రైవేటీకరించే బ్యాంకుల్లో ప్రభుత్వ పాత్ర ను తగ్గించడం ద్వారా కార్పొరేట్ కిందకు తీసుకు వస్తాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీనితో పాటు తాజా మూలధనం విదేశీ పెట్టుబడులు కూడా ఈ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కి ఆహ్వానిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: