గాంధీ లండన్ లో లా పూర్తి చేశారు. ఆ తర్వాత 1893వ సంవత్సరంలో ఉద్యోగం కోసం దక్షిణాఫ్రికాకు వెళ్లారు. అక్కడ జాతి వివక్ష కారణంగా ఎన్నో అవమానాలు పొందారు. ఆ దేశంలో మన ఇండియన్స్ అన్నా.. కార్మికులన్నా అక్కడి వారు చాలా చిన్నతనంగా చూసేవారు. అదే గాంధీకి నచ్చలేదు. దీంతో అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేశారు. అలాంటి సమయంలోనే రెండో బోర్ యుద్ధం పురుడుపోసుకుంది. దక్షిణాఫ్రికా దేశంలో డచ్ మాట్లాడే ప్రజలుంటే రాష్ట్రాలను బోర్ రిపబ్లిక్ అని పిలుస్తారు. ఆరెంచ్ ఫ్రీ స్టేట్ కూడా ఆ కోవకు చెందిందే. ఆ సమయంలోనే దక్షిణాఫ్రికాపై బ్రిటన్ పైచేయి సాధించింది. ఇంకేముంది బోర్ రిపబ్లిక్స్, ఆరెంచ్ ఫ్రీ స్టేట్ ఓటమిపాలయ్యాయి. ఈ రాష్ట్రాల్లో ఎక్కువ శాతం బంగారం, వజ్రాల నిధులు లభిస్తాయి. వీటి కోసం పోరాటం పెద్ద ఎత్తున జరిగింది. ఈ వార్ లో బ్రిటన్ వైపున నిలబడి పోరాడిన సైనికుల్లో ఎక్కువ మంది భారతీయ సైనికులే ఉన్నారు.

ఆ సమయంలో బ్రిటిష్ పౌరులకుండే హక్కులు తమకూ ఇవ్వాలని మన భారతీయులు డిమాండ్ చేశారు. ఆ పోరాటంలో భారతీయుల తరఫున నిలబడ్డారు గాంధీ. యుద్ధంలో గాయాలపాలైన సైనికులను ఆస్పత్రులకు తరలించి.. చికిత్స అందించడంలో తనపాత్ర పోషించారు. అంతేకాదు బ్రిటన్ సైన్యంలో సార్జెంట్ మేజర్ గా తన వంతు సేవందించారు. ఐదు నెలలపాటు ఆయన ఆ విధులు నిర్వర్తించారు. అందుకు గాను స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. బ్రిటన్ ప్రభుత్వం గాంధీ సేవలను మెచ్చింది. 1915లో భారత్ కు తిరిగొచ్చాక కైసర్-ఇ-హింద్ పురస్కారంతో సత్కరించింది. అయితే జలియన్ వాలా బాగ్ దుర్ఘటన జరిగిన తర్వాత మహాత్ముడు దాన్ని తిరిగి ఇచ్చేశారు.

అంతేకాదు ప్రపంచ యుద్ధంలో గాంధీ తాను ఎక్కడికి వెళ్లినా... బ్రిటన్ తరఫున పాల్గొనాలని యువకులకు పిలుపునిచ్చారు.  అందులో భాగంగా స్వయంగా తన చేతి నుంచే కొంత సొమ్మును విరాళంగా ఇచ్చారు కూడా. ఇందుకు ఒక కారణం కూడా ఉంది. తొలి ప్రపంచయుద్ధంలో నెగ్గగానే మన ఇండియాకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తామని బ్రిటిషన్ ప్రభుత్వం చెప్పడంతో గాంధీ ఇలా చేశారు. గాంధీతో పాటు ఇతర ముఖ్యనాయకులు అందుకు మద్ధతు కూడా పలికారు. కానీ యుద్ధం పూర్తయిన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం మాట తప్పింది. స్వయం ప్రతి ఇవ్వడం పక్కన పెడితే.. మనోళ్లపై కఠిన ఆంక్షలు రుద్దింది. ఈ విషయం గాంధీ మనసును బాధించింది. అప్పటి నుంచే ఆయన ఉద్యమానికి ఊపిరిలూదారు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: